Marriage: ఉదయం పెళ్లి, మద్యాహ్నం విందు భోజనం, రాత్రి శవమైన పెళ్లి కొడుకు, హోటల్ లో టెక్కీ !
చెన్నై/ పుదుచ్చేరి: ఇంజనీరింగ్ చదివే సమయంలో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కాలేజ్ లో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న ప్రియుడు సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ప్రియురాలికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరూ కలుసుకుంటున్నారు. ప్రేమికుల విషయం తెలుసుకున్న పెద్దలు ఇద్దరికి పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యి పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. ఉదయం అందరి సమక్షంలో పెళ్లి జరిగింది. మద్యాహ్నం అందరికి పెళ్లి వింధులు ఏర్పాటు చేశారు. పెళ్లి రోజు రాత్రి కల్యాణపండపంలో గ్రాండ్ గా రిసెప్షన్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. డ్రస్ మార్చుకుని వస్తానని హోటల్ రూమ్ లోకి వెళ్లిన పెళ్లి కొడుకు తరువాత శవమైనాడు. పెళ్లి రోజు టెక్కీ అనుమానాస్పదస్థితిలో చనిపోవడం కలకలం రేపింది.

ఇంజనీరింగ్ కాలేజ్
చెన్నై సిటీలో తాంబరంలో సురేష్ కుమార్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని కోటకుప్పం ప్రాంతానికి చెందిన గోమతి (30) అనే యువతి కొన్ని సంవత్సరాల క్రితం పెరంబలూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరింది. అప్పట్లో అదే సంవత్సరంలో సురేష్ కుమార్ కూడా అదే కాలేజ్ లో ఇంజనీరింగ్ లో చేరాడు.

కాలేజ్ లవర్స్
ఇంజనీరింగ్ కాలేజ్ లో సురేష్ కుమార్, గోమతికి పరిచయం అయ్యింది. కొంతకాలం తరువాత గోమతి, సురేష్ కుమార్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. కాలేజ్ చదువు పూర్తి అయ్యే వరకు ప్రేమికులు సురేష్ కుమార్, గోమతి చాలా సంతోషంగా తిరిగేశారు. కాలేజ్ పూర్తి అయిన తరువాత గోమతి, సురేష్ కుమార్ వారి సొంతఊర్లకు వెళ్లిపోయారు.

మంచి ఉద్యోగాలు చేస్తున్న ప్రేమికులు
ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న ప్రియుడు సురేష్ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరాడు. సురేష్ కుమార్ ప్రియురాలు గోమతికి కోటకుప్పంలోని మునిసిపల్ కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగాలు చేస్తున్న ప్రేమికులు సురేష్ కుమార్, గోమతి ఇద్దరూ కలుసుకుంటున్నారు.

ఉదయం గ్రాండ్ గా పెళ్లి
ప్రేమికులు సురేష్ కుమార్, గొమతి వాళ్ల ప్రేమ విషయం వాళ్ల ఇళ్లల్లో చెప్పారు. ప్రేమికులు విషయం తెలుసుకున్న పెద్దలు ఇద్దరికి పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యి అక్టోబర్ 10వ తేదీ (నిన్న) పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. శుక్రవారం ఉదయం పుదుచ్చేరిలోని కాలపట్టులోని బాలమురుగన్ ఆలయంలో సురేష్ కుమార్, గోమతిల వివాహం జరిగిపోయింది. పెళ్లికి బంధువులు, స్నేహితులు హాజరైనారు.

పెళ్లికొడుక్కి హోటల్ లో రూమ్
మద్యాహ్నం అందరికి పెళ్లి వింధు భోజనం ఏర్పాటు చేశారు. అదేరోజు కోటకుప్పం చేరుకున్నారు. సాయంత్రం ప్రైవేట్ హోటల్ లో గ్రాండ్ గా సురేష్ కుమార్, గోమతిల రిసెప్షన్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. సురేష్ కుమార్ ది చెన్నై కావడంతో అతనితో పాటు కుటుంబ సభ్యులు బస చెయ్యడానికి గోమతి కుటుంబ సభ్యులు హోటల్ లో రూమ్ లు తీసిచ్చారు.

పెళ్లి రోజు శవమైన పెళ్లి కొడుకు
గురువారం సాయంత్రం డ్రస్ మార్చుకుని వస్తానని హోటల్ రూమ్ లోకి వెళ్లిన పెళ్లి కొడుకు సురేష్ కుమార్ ఎంతసేపటికి బయటకు రాలేదు. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా రూమ్ లో బెడ్ మీద సురేష్ కుమార్ చాలా నీరసంగాపడి ఉన్న విషయం వెలుగు చూసింది. వెంటనే సురేష్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు.

హోటల్ రూమ్ లో ఏం జరిగింది ?
అయితే అప్పటికే సురేష్ కుమార్ ప్రాణం పోయిందని వెలుగు చూడటం కలకలం రేపింది. పెళ్లి రోజు పెళ్లి కొడుకు సురేష్ కుమార్ అనుమానాస్పదస్థితిలో చనిపోవడం కలకలం రేపింది. పెళ్లి రిసెప్షన్ కు బంధువులు అందరూ వచ్చేశారు. పెళ్లి కొడుకు సురేష్ కుమార్ పెళ్లి రోజు చనిపోవడంతో గోమతి ఆర్తనాదాలు చేస్తోంది. కేసు విచారణలో ఉంది.












Click it and Unblock the Notifications