బద్ధ శత్రువులైన లాలూ, ములాయం బంధువులు కాబోతున్నారు...!
న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌లు త్వరలో బంధువులు కాబోతున్నారు. ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్, లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కూతరు రాజలక్ష్మికి వివాహం కుదిరింది.
డిసెంబర్‌లో ఎంగేజ్ మెంట్ చేసుకోనున్న వీరి పెళ్లిని ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రెండు కుటుంబాలు ప్రణాళికలు చేస్తున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన తాత ములాయం సొంత నియోజకవర్గం మెయిన్ పురి నుంచి బరిలోకి దిగిన తేజ్ ప్రతాప్ పార్లమెంట్‌లో తొలిసారిగా అడుగుపెట్టారు.

ఇద్దరూ ఒకే సామాజికి వర్గానికి చెందినా... బద్ద శత్రువులుగానే కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలం రాజకీయ శత్రువులుగా కొనసాగిన వీరి మధ్య ఈ పెళ్లి ద్వారా మైత్రి చిగురించింది.
ఇప్పటికే బీహార్‌లో అధికార జనతాదళ్(యూ), మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సారధ్యంలో ఆర్‌జేడీ రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.












Click it and Unblock the Notifications