పెళ్లిలో డీజే ఆపేశారని వరుడి తండ్రి హత్య
డెహ్రాడూన్: పెళ్లి మండపంలో విషాదం నెలకొంది. బాలీవుడ్ పాటలు పెట్టలేదనే కారణంగా మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు వరుడి తండ్రిని కాల్చ చంపారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మంగ్లూరు సమీపంలోని సాకోటీ గ్రామంలో విశ్వాస్ రామ్ అనే వ్యక్తి ఇంట్లో తన కుమారుడి వివాహం జరుగుతోంది. పెళ్లి మంత్రాలు మొదలు పెడుతుండగా డీజే ఆపాలని విశ్వాస్ రామ్ అన్నాడు. తాగిన మత్తులో పెళ్లికి వచ్చిన ముగ్గురు యువకులు తాము డీజే ఆపేది లేదంటూ మరింత సౌండ్ పెట్టారు.

దీంతో విశ్వాస్ రామ్‌కు, ముగ్గురు యువకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలో ఓ యువకుడు తన దగ్గర ఉన్న తుపాకీతో డీజే ఆపొద్దని బెదిరించాడు. డీజే ఆపేయడంతో తీవ్ర ఆగ్రాహానికి గురైన ఆ యువకుడు తుపాకీతో విశ్వాస్‌ను కాల్చేశాడు.
కుటుంబసభ్యులు విశ్వాస్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు నిందిత యువకులను పట్టుకుని చితక్కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications