బల్జీత్ తండ్రీ అమర జవానే: పాక్‌కు రాజ్‌నాథ్ హెచ్చరిక
న్యూఢిల్లీ: ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి బల్జీత్ సింగ్ తండ్రి కూడా గతంలో మిలిటెంట్ల కాల్పులకు బలయ్యారు. ఆయన పేరు అచ్చార్ సింగ్. 1984లో పంజాబ్‌లో తీవ్రవాదం పెద్ద ఎత్తున ఉన్న సమయంలో మిలిటెంట్ల కారణంగా జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు.
అచ్చార్ సింగ్ పంజాబ్‌లోని ఫగ్వారా ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారు. అనంతరం విజిలెన్స్ విభాగంలో పని చేశారు. అనంతరం విజిలెన్స్ విభాగంలో సేవలందించారు. ఏడవ ఐఆర్బీ బెటాలియన్లో డిప్యూటీ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయన ఉగ్రవాదుల కుట్రకు బలయ్యారు.
తండ్రి మరణం అనంతరం 1985లో బల్జీత్ సింగ్ సహాయ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా పంజాబ్ పోలీసు విభాగంలో చేరారు. అనంతరం డిటెక్టివ్ విభాగంలో ఎస్పీ హోదాలో పని చేస్తున్నారు. సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో బల్జీత్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయన స్వగ్రామం కపుర్తలాలోని సంత్ పురాలో విషాధఛాయలు నెలకొన్నాయి.

సవాలు చేస్తే దీటైన సమాధానం చెబుతాం
పంజాబ్‌లో తీవ్రవాదుల దాడులను కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్‌తో భారత్ స్నేహపూరిత సంబంధాన్ని కోరుకుంటోందని అన్నారు. భారత దేశ గౌరవాన్ని సవాలుచేస్తే దీటైన సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.
బస్సు డ్రైవరును సత్కరించనున్న పంజాబ్
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో సోమవారం ఉదయం ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు బస్సును చాకచక్యంగా నడిపి, 65 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవరు నానక్‌చందాను సత్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. సైనిక దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు బస్సును ఆపాలని ప్రయత్నించినప్పుడు ఆయన ఆపలేదు.
అప్పుడు జరిగిన కాల్పుల్లో గాయపడినవారిని రక్షించడానికి బస్సును నేరుగా ఆసుపత్రికి తీసుకుపోయి, ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. నానక్‌ను సత్కరించనున్నట్లు పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తెలిపారు. డ్రైవర్ ఉగ్రవాదుల పైకి బస్సుతో దూసుకెళ్లాడు. దీంతో వారు తోకముడిచారు.












Click it and Unblock the Notifications