లక్ష్మీ పూజ చేసి మసీదు ప్రారంభించారు, దేశానికే ఆదర్శం, హిందూ ముస్లీం సోదరులు !

బెంగళూరు: లక్ష్మీ పూజ చేసి మసీదును ప్రారంభించారు. హిందువులు, ముస్లీంలు ఒక్కటిగా ఉంటామని, మాకు ఎలాంటి కుల, మతాలు అడ్డురావని దేశానికే చాటి చెప్పిన సంఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగింది. హిందువులు, ముస్లీం సోదరులు కలిసి లక్ష్మీ పూజ చేసి అనంతరం మసీదును ఘనంగా ప్రారంభించారు.

విజయపుర జిల్లాలోని బబలేశ్వర తాలుకా యక్కుండియ గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో లాలసాబ ఆలీ ఫిరా మసీదు నిర్మించారు. ఈ లాలసాబ ఆలీ ఫిరా మసీదును వినూత్నంగా ప్రారంభించాలని గ్రామస్తులు నిర్ణయించారు. మసీదును లక్ష్మీ పూజ చేసి ప్రారంభించాలని ఆ గ్రామంలోని హిందూ, ముస్లీం పెద్దలు నిర్ణయించారు.

Masid inauguration by Lakshi Pooja at Yakkundi in Karnataka

గ్రామ ప్రజలు అనుకున్నట్లే హిందూ దేవుడి పటాలు మసీదు దగ్గర పెట్టి దీపాలు వెలిగించి లక్ష్మీ పూజలు చేసి లాలసాబ ఆలీ ఫిరా మసీదును ప్రారంభించారు. కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంబీ. పాటిల్ ఈ వినూత్న కార్యక్రమానికి హాజరైనారు.

Masid inauguration by Lakshi Pooja at Yakkundi in Karnataka

మసీదు ప్రారంభోత్సవానికి లక్ష్మీ పూజ చెయ్యడం చాల సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమానికి తాను హాజరుకావడం ఆనందంగా ఉందని మాజీ మంత్రి ఎంబీ. పాటిల్ ట్వీట్ చేశారు. చిన్న విషయాలకు మతఘర్షణలు జరుగుతుంటాయని మాజీ మంత్రి ఎంబీ. పాటిల్ విచారం వ్యక్తం చేశారు.

మతఘర్షణలను రెచ్చగొట్టే వారికి తగిన బుద్ది చెప్పడానికి, అలాంటి మతఘర్షణకు దూరంగా ఉండాలనే గ్రామస్తులు కలిసి లక్ష్మీ పూజ చేసి మసీదును ప్రారంభించారని మాజీ మంత్రి ఎంబీ. పాటిల్ అన్నారు. తన సొంత నియోజక వర్గంలో లక్ష్మీ పూజ చేసి మసీదు ప్రారంభించడం చాల సంతోషంగా ఉందని, ఈ గ్రామస్తులు పలువురికి ఆదర్శంగా నిలిచారని మాజీ మంత్రి ఎంబీ. పాటిల్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+