వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్: ఉద్యోగాలకు కోత పెడుతున్న టెక్ కంపెనీలివే

ఐటీ, టెలికం రంగాలు అత్యంత ఇబ్బందికరపరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ రంగంలో చోటుచేసుకొంటున్న మార్పుల టెక్కీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐటీ, టెలికం రంగాలు అత్యంత ఇబ్బందికరపరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ రంగంలో చోటుచేసుకొంటున్న మార్పుల టెక్కీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో టెలికం పరిశ్రమ కూడ ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది.

ఐటీ పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి.అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాద్యతలు స్వీకరించిన తర్వాత తీసుకొన్న నిర్ణయాలు సాఫ్ట్ వేర్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.ఖర్చు తగ్గించుకోవడం, ఉద్యోగుల్లో కోత పెట్టడం వంటి చర్యలకు సాఫ్ట్ వేర్ కంపెనీలు పూనుకొంటున్నాయి.

వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు హైర్ అమెరికన్, బై అమెరికన్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను అమెరికా తీసుకురావడంతో సాఫ్ట్ వేర్ కంపెనీలు అమెరికాలోనే నివాసం ఉండే స్థానికులకే ఉద్యోగాలను కల్పించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

రిలయన్స్ జియో రంగ ప్రవేశం తర్వాత టెలికం కంపెనీల ఆదాయం కూడ భారీగా తగ్గిపోయింది.దీంతో కొన్ని టెలికం కంపెనీలు ఖర్చులను తగ్గించుకొనేందుకుగాను ఉద్యోగులపై వేటు వేసేందుకు రంగం సిద్దం చేశాయి.2008-10 లో నెలకొన్న పరిస్థితుల్లో ఇప్పడు మళ్ళీ కంపెనీల్లో చవిచూస్తున్నాయి..ఈ కంపెనీల్లో ఉద్యోగులపై వేటు వేసే అవకాశం కన్పిస్తోంది.

 కాప్టెమినిలో 8 వేల మంది తొలగింపు

కాప్టెమినిలో 8 వేల మంది తొలగింపు

ఫ్రెంచ్ కు చెందిన ఐటీ సర్వీసుల దిగ్గజం కాప్టెమిని కూడ సుమారు 8 వేల మందిని ఇంటికి పంపించనున్నట్టు తెలిసింది. ఫిబ్రవరిలోనే 35 మంది వీపీ, ఎన్వీపీ, డైరెక్టర్లు, సీనియర్ డైరెక్టర్లను కంపెనీని వీడాలని కాప్టెమిని ఆదేశించింది.అంతేకాకుండా తన ఆఫీసుల్లో ఒకటైన ముంబైలో 200మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. లేఆఫ్స్ గురించి స్పందించిన కంపెనీ ఉద్యోగులను తీసే క్రమంలోనే కొత్త ఉద్యోగులను కంపెనీలోకి తీసుకొంటున్నట్టు తెలిపింది.

ఇన్పోసిస్ లో వెయ్యి మందిపై వేటు

ఇన్పోసిస్ లో వెయ్యి మందిపై వేటు

వచ్చే కొన్ని రోజుల్లో దేశీయ టెక్ దిగ్గజం ఇన్పోసిస్ లో భారీగా ఉద్యోగులపై వేటు వేయనుంది.ఈ కంపెనీ నుండి సుమారు వెయ్యిమంది ఉద్యోగులను తీసేసే అవకాశాలున్నట్టు సమాచారం. అయితే దీనిలో గ్రూప్ ప్రాజెక్టు మేనేజర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, సీనియర్ అర్కిటెక్స్,, హైయర్ లెవల్స్ స్థాయిలో వారే ఉంటారు.అయితే అమెరికాలో ఉండేవారికి పదివేల ఉద్యోగాలను ప్రకటించింది.

విప్రో లో కూడ

విప్రో లో కూడ

విప్రోలో పనితీరు బాగాలేదనే సాకుతో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది.ఇప్పటికే ఈ కంపెనీ నుండి 600 నుండి రెండువేల మంది ఉద్యోగులను ఇంటికి పంపారు. అంతేకాకుండా కంపెనీలో అదనపు లేయర్లను తీసేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

కాగ్నిజెంట్ లో భారీగా ఉద్యోగులపై వేటు

కాగ్నిజెంట్ లో భారీగా ఉద్యోగులపై వేటు

ఓ వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలతో పాటు ఆటోమెషన్ ప్రభావం సాఫ్ట్ వేర్ రంగంపై తీవ్రంగా కన్పిస్తోంది. 6 వేల మందికి ఈ కంపెనీ నుండి తొలగించనుంది..పింక్ స్లిప్పులను అందుకొన్న ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. మొత్తం ఉద్యోగుల్లో సుమారు 2.3 శాతం ఉద్యోగులను కంపెనీ తీసేయనుంది. కొత్త డిజిటల్ సర్వీసులోకి మళ్ళే క్రమంలో ఐటీ ఇండస్ట్రీ సీనియర్ ఉద్యోగులను సాదరంగా ఇంటికి పంపేందుకు రంగం సిద్దం చేసింది. 9 నెలల జీతాలిచ్చి వారిని ఉద్యోగం నుండి తొలగించేందుకు రంగం సిద్దం చేసింది.

టాటా టెలిసర్వీసెస్ లో 600 ఉద్యోగులపై వేటు

టాటా టెలిసర్వీసెస్ లో 600 ఉద్యోగులపై వేటు

టాటా గ్రూప్ కు చెందిన టాటా టెలిసర్వీసెస్ నుండి సుమారు 600 ఉద్యోగులను తీసేసింది. ఈ ఉద్యోగులంతా సేల్స్ , ఇతర సంబంధిత విబాగాల్లో పనిచేస్తున్నారు. ఉద్యోగాల నుండి తొలగించినవారికి సెపరెన్స్ ఫ్యాకేజీని కూడ కంపెనీ ఆఫర్ చేసింది. ప్రతి ఏటా సర్వీసుకు ఒక జీతం చొప్పున కంపెనీ ఈ ఉద్యోగులకు ఇచ్చింది.

ఎయిర్ సెల్ లో 10 శాతం ఉద్యోగులపై వేటు

ఎయిర్ సెల్ లో 10 శాతం ఉద్యోగులపై వేటు

ఈ ఏడాది ఫిబ్రవరి లో సెల్యూలార్ సర్వీసెస్ మేజర్ ఎయిర్ సెల్ తన ఉద్యోగుల్లో 700 మందికి పింక్ స్లిప్ లు ఇచ్చింది. అంటే తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించింది. దేశీయ టెలికమ్యూనికేషన్ రంగంలో ఇదే తొలి ఉద్యోగాల కొత. దేశవ్యాప్తంగా ఎయిర్ సెల్ లో దాదాపుగా 8వేలమంది ఉద్యోగులున్నారు.

స్నాప్ డీల్ లో వెయ్యి మందిపై వేటు

స్నాప్ డీల్ లో వెయ్యి మందిపై వేటు

దేశీయ ఈ కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ కూడ మార్కెట్ లో అతలాకుతలమౌతోంది. ఈ ప్రభావం ఉద్యోగులపై పడుతోంది. ఓ వైపు విక్రయచర్చలు జరుపుతున్న ఈ కంపెనీ ఉద్యోతాల కొతను ఫిబ్రవరిలోనే ప్రకటించింది.అయితే ఎంతమందిపై ఈ ప్రభావం ఉంటుందనే విషయం ఇంకా బయటకు రాలేదు. అంతేకాకుండా వెయ్యి మంది కాంట్రాక్ట్ ఉద్యోగులపై కూడ ప్రభావం చూపనుంది.

క్రాఫ్ట్స్ విల్లా యఫ్ మీ లో కూడ

క్రాఫ్ట్స్ విల్లా యఫ్ మీ లో కూడ

సంప్రదాయ వస్త్రాలను మార్కెటింగ్ చేస్తున్న క్రాఫ్ట్స్ విల్లా ఫ్యాషన్ ఫోర్టల్ యప్ మీ ఈ రెండు స్టార్టప్ లు గత కొన్ని వారాలుగా ఉద్యోగులకు పింక్ స్లిప్ లు ఇచ్చాయి. క్రాఫ్ట్స్ విల్లా వందమందికిపైగా ఉద్యోగులను తీసేయగా, యఫ్ మీ కూడ ఇటీవల క్వాలిటీ కంట్రోల్ టీమ్స్ వేరే హౌజింగ్ లో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు తెలిసింది.

English summary
Cognizant appears set to cut at least 6,000 jobs, which represents 2.3% of its total workforce, as the IT MNC struggles with growth in an IT environment that is fast shifting towards new digital services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X