Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాథులా లోయలో భారీ హిమపాతం: ఆరుగురు మృతి, మంచుకిందే పలువురు పర్యాటకులు

న్యూఢిల్లీ: సిక్కింలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాథూలా పర్వత లోయ ప్రాంతంలో మంగళవారం భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు పర్యాటకులు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో పర్యాటకులు మంచు కింద చిక్కుకుపోయినట్లు సమాచారం.

సిక్కిం రాజధాని గ్యాంగ్టక్‌ను .. చైనా సరిహద్దు సమీపంలోని నాథులా పాస్‌ను కలిపే జవహర్ లాల్ నెహ్రూ మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సరిహద్దు రహదారుల సంస్థ, సిక్కిం పోలీసులు, స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 22 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు.

 Massive Avalanche In Sikkims Nathula, Six Tourists Dead, Several injured, many people trapped

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గ్యాంగ్టక్‌కు తరలించినట్లు వెల్లడించారు. మంచు కారణంగా రోడ్డుపై వాహనాల్లో చిక్కుకుపోయిన 350 మందిని కాపాడినట్లు తెలిపారు. కాగా, హిమపాతం సంభవించినప్పుడు 150 మందికి పైగా విహారయాత్రలు ఆ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం.

 Massive Avalanche In Sikkims Nathula, Six Tourists Dead, Several injured, many people trapped

మార్చి నుంచి సిక్కిం సాధారణ హిమపాతాన్ని ఎదుర్కొంటోంది. నాథులా పాస్‌కు దారితీసే జేఎన్ రోడ్‌లోని 13వ మైలుకు పర్యాటకుల ప్రవేశాన్ని పరిమితం చేసింది.

పర్యాటకులు 13వ మైలు వరకు వెళ్లేందుకు అనుమతించినప్పటికీ.. హిమపాతం కారణంగా వారిలో చాలా మంది 15వ మైలు వరకు ఎక్కారని సిక్కిం ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. దాని సుందరమైన అందం కారణంగా, చైనా సరిహద్దులో ఉన్న నాథులా పాస్ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+