వీర జవాన్ల కుటుంబాలకు మాతా అమృతానందమయి సాయం .. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు

ఇస్లామాబాద్ : పుల్వామాలో ఉగ్ర మూకల దుశ్చర్యతో నెలకొరిగిన వీర జవాన్లను యావత్ జాతి కీర్తిస్తోంది. వారు లేకున్నా కుటుంబాల కోసం ఆర్థికసాయం ప్రకటించి .. భరోసా కల్పిస్తున్నారు. తాజాగా వీర జవాన్ల కుటుంబాలకు మాతా అమృతానందమయి సాయం చేస్తానని ప్రకటించారు. చనిపోయిన ఒక్కో జవాను కుటుంబానికి రూ. 5 లక్షల సాయం అందజేస్తానని ప్రకటించారు.

Mata Amritanandamayi to Donate Rs 5 lakh Each to Families of CRPF Martyred in Pulwama

వీరులకు వందనం
భరతజాతి వీరులను కోల్పోయిందని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. తమ కర్తవ్య నిర్వహణలో జవాన్లు నెలకొరిగారు. దేశ రక్షణ కోసం సరిహద్దులో వీర మరణం పొందారు. వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. వారి కుటుంబసభ్యులకు, బంధువులకు నా ప్రగాఢ సానుభూతి .. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని మాతా తన సందేశంలో ప్రస్తావించారు.

విస్తరిస్తున్న ట్రస్ట్ సేవలు
మాతా అమృతానందమయి ట్రస్ట్ రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తన అభిమానులను సంపాదించుకుంటోంది. 3.8 కోట్ల మందిని తన ప్రసంగాలతో మాత ఉత్తేజపరిచారు. ఇంతమందికి ఎలా సాయం చేయగలుగుతున్నారని అమ్మను ప్రశ్నిస్తే .. 'ఎక్కడైతే నిజమైన ప్రేమ ఉందో .. ప్రతిదీ సాధ్యమే ... ప్రేమ పరివర్తనం' చెందుతోంది అని సమాధానం ఇచ్చారు. దీంతోపాటు ప్రపంచంలో మత వ్యాప్తి అనే అంశంపై భారత పార్లమెంట్ లో రెండు సార్లు ... ఐక్యరాజ్యసమితితో పలుమార్లు అమ్మ ప్రసంగించారని ట్రస్ట్ నిర్వాహకులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+