గురుత్వాకర్షణ కనుగొనేందుకు ఐన్‌స్టీన్‌కు మ్యాస్ సాయ పడలేదు.. నిర్మలాకు పియూష్ బాసట
న్యూఢిల్లీ : ఆటో మొబైల్ విక్రయాలు పడిపోవడానికి క్యాబ్‌లే కారణమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన కామెంట్లు చర్చకు దారితీశాయి. ఆమె తీరును తప్పుపడుతూ నెటిజన్లు దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్మలా వ్యాఖ్యలను మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తప్పుపట్టారు. దీంతో ఆటో మొబైల్ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా దీనిపై మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా కామెంట్ చేయడం చర్చానీయాంశమైంది.
దేశంలో గత 18 నెలలుగా ఆర్థికమాంద్యం కొనసాగుతుంది. దీంతో ఆటోమొబైల్ వాహనాల విక్రయాలు పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో నిర్మలా వ్యాఖ్యలను సమర్థించేందుకు రంగంలోకి దిగారు పియూష్ గోయల్. ఐదేళ్లలో 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ తమ లక్ష్యమని మోడీ ప్రభుత్వం చెప్తున్న అంశాన్ని ప్రస్తావించారు. గురువారం బోర్డు ఆఫ్ ట్రేడ్ సమావేశానికి హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఐన్‌స్టీన్ శాస్త్రవేత్త .. గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నారు. కానీ ఆయనకు మ్యాస్ ఉపయోగపడలేదన్నారు.

మీరు టీవీలో చూసి దేశ స్థూల దేశీయోత్పత్తిని అంచనా వేయకండి.. ఇదీ లెక్కలకు సంబంధించిన అంశం కానే కాదు .. అంతేందుకు ఐన్‌స్టీన్‌కు కూడా మ్యాస్ సాయపడలేదని గుర్తుచేశారు. అతని సిద్ధాంతాలు, ఆలోచన వల్లే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుగొన్నారని పేర్కొన్నారు. తర్వాత మాట్లాడిన మరో కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ కూడా గోయల్ లాగే మాట్లాడారు. తొలుత గురుత్వాకర్షణ శక్తిని ఐజాక్ న్యూటన్ కనుగొన్నారని .. కానీ దానికి సాపేక్ష సిద్ధాంతాలు జోడించి గురుత్వాకర్షణ శక్తిని ఐన్ స్టీన్ కనుగొన్నారని పేర్కొన్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications