‘మ్యాక్స్‌లైఫ్’ మహిళా ఎగ్జిక్యూటివ్ మిస్సింగ్
గుర్గావ్: హర్యానాలోని గుర్గావ్ మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహిస్తున్న తనూ ప్రభాకర్(29) అనే మహిళ రెండ్రోజుల క్రితం అదృశ్యమైంది.
ఫిబ్రవరి 17న ఆఫీస్‌కు వచ్చిన ఆమె భోజన విరామ సమయంలో బయటకు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె కనబడకుండా పోయిందని సహోద్యోగులు తెలిపారు. ఆమె ఫోన్‌కు కాల్ చేశామని, అయితే ఎలాంటి సమాచారం లేదన్నారు.
దీంతో వారు ఆమెకు ఈ మెయిల్ పెట్టగా.. అత్యవసర పనిమీద కొద్ది రోజులు ఊరు వదలి వెళ్తున్నట్లు తనూ బదులు ఇచ్చినట్లు సహోద్యోగులు చెప్పారు. కాగా, ఆమె అదృశ్యంపై తనూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

తనూ స్నేహితుడు ప్రిన్స్ పాఠక్ అనే వ్యక్తిపై వారు ఫిర్యాదు చేశారు. అతడే తనూను కిడ్నాప్ చేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది ఇలా ఉండగా, ఇటీవల స్నాప్‌డీల్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగినిని ఆమెను ప్రేమిస్తున్న వ్యక్తి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆమెకు ఎలాంటి హాని కలిగించకుండా వదిలిపెట్టడంతో కంపెనీ, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత కిడ్నాప్‌నకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications