మాయా ఇదీ తగదు : మోదీపై వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ కౌంటర్
న్యూఢిల్లీ : బీజేపీలో మహిళ నేతల భర్తలు మోదీని కలువడంతో .. ఎక్కడ తన భర్తలు తమను వీడిపోతారనే మాయావతి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, బీజేపీ నేత నిర్మలా సీతారామన్ స్పందించారు. మాయావతి విమర్శలు దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తమ పార్టీలో మహిళ నేతలంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. లేనిది ఊహించుకొని అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
అభద్రతాభావం లేదు ..
బీజేపీలో మహిళ నేతలంతా పూర్తి సురక్షితంగా, ఎలాంటి అభద్రతాభావం లేకుండా ఉన్నారని ఉద్గాటించారు నిర్మలా. తమ గురించి మాయావతి బెంగపడాల్సిన అవసరం లేదన్నారు. మోదీ, ఆయన వ్యక్తిగత జీవితం, బీజేపీ మహిళా నేతలపై మాయవతి వ్యాఖ్యలను ఖండించారు. దళితుల జాబితాలో తాను ఒక్కరే ఉన్నానని మాయావతి అనుకుంటున్నారా నిర్మలా ప్రశ్నించారు. వాస్తవానికి మాయావతి మాట్లాడేది దళితుల గురించేనా అని నిలదీశారు. నిజానికి మాయావతి అభ్రదతాభావంతో ఉన్నారని స్పష్టంచేశారు. అందుకోసమే లేనిది ఉన్నట్టు ఊహించుకొని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దళితనేతగా వారి హక్కుల కోసం పోరాడాల్సింది పోయి .. కాంగ్రెస్ తో జట్టుకట్టడం బీఎస్పీ నైజం ఏంటో అర్థమవుతోందన్నారు.

దళిత బాలిక రేప్ ఘటనతో ...
రాజస్థాన్‌లోని అల్వార్‌లో దళిత బాలిక రేప్ పై మాయావతి మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. దీంతో బెహన్ జీ ధీటుగా స్పందించారు. బీజేపీలోని మహిళ నేతల భర్తలు మోదీని కలుస్తున్నారంటే .. ఆ మహిళలు భయపడుతున్నారా అని ప్రశ్నించారు. మోదీ లాగా తమ భర్తలు కూడా వదిలేస్తారెమోనని భయం ఉందని కామెంట్ చేశారు. దీంతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ... ధీటుగా కౌంటర్ చేశారు. అంతేకాదు మోదీపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ లో దళిత బాలికపై అఘాయిత్యం జరిగిన ... దళిత్ కార్డు చూపే మాయావతి స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ భాగస్వామ్య పక్షంగా కొనసాగడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. దీనిని దళితులు గమనిస్తున్నారని ... మీ వైఖరి ఇదేనా అని కొశ్చన్ చేశారు నిర్మలా సీతారామన్.












Click it and Unblock the Notifications