రాజ్యసభ సభ్యత్వానికి మాయావతి రాజీనామా, కారణమిదే!

బిఎస్‌పి అధినేత్రి మాయావతి తన రాజ్యసభ సభ్యత్వానికి మంగళవారంనాడు మధ్యాహ్నం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మెన్ హమీద్ అన్సారీకి పంపారు.

న్యూఢిల్లీ: బిఎస్‌పి అధినేత్రి మాయావతి తన రాజ్యసభ సభ్యత్వానికి మంగళవారంనాడు మధ్యాహ్నం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మెన్ హమీద్ అన్సారీకి పంపారు.

ఇవాళ రాజ్యసభలో దళితుల సమస్యలపై మాడ్లాడుతుండగా, అందుకు అనుమతి అనుమతించకపోవడంపై ఆమె మనస్థాపానికి గురయ్యారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై చోటుచేసుకొన్న దాడులను ప్రస్తావిస్తూ ఈ అంశంపై చర్చకు సమయం ఇవ్వాలని ఆమె కోరారు. అయితే ఈ విషయమై మాట్లాడేందుకు రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ కురియన్ ఆమెకు సమయాన్ని ఇచ్చేందుకు నిరాకరించారు.

Mayawati resigns from Rajya Sabha after not being allowed to speak on Dalit

దీంతో ఆమె తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు. తనను ఇప్పుడు మాట్లాడనివ్వకపోతే రాజ్యసభసభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆమె సభలోనే హెచ్చరించారు. సభ నుండి ఆమె వాకౌట్ చేశారు.

సభ నుండి బయటకు వెళ్ళగానే ఆమె తన రాజ్యసభ సభత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మెన్ హామీద్ అన్సారీకి పంపారు.

ఈ రోజు రాజ్య‌స‌భ‌లో తాను ద‌ళితుల గురించి మాట్లాడుతోంటే అందుకు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని ఆమె మండిప‌డ్డారు. వారి గురించి మాట్లాడేందుకు తాను నిల‌బ‌డ‌గానే త‌న ప్ర‌సంగాన్ని అడ్డుకునేందుకు అధికార ప‌క్ష స‌భ్యులు పైకి లేచి నిలబ‌డ్డార‌ని ఆమె తెలిపారు. ఇది చాలా దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని చెప్పారు. దేశంలోని ద‌ళితులు వెన‌క‌బ‌డిన వ‌ర్గాల వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించే అవ‌కాశం రాన‌ప్పుడు త‌నకు రాజ్య‌స‌భ‌లో కొన‌సాగే అధికారం లేద‌ని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+