చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..
అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ ఇటీవల చైనా చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ తమదేనని.. భారత్ నుంచి విడదీయలేనిదని భారత్ స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. చైనా వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అయితే ఇటీవల.. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ప్రేమ వాంగ్ జోమ్ అనే మహిళపై చైనాలోని షాంఘై పుడాంగ్ ఎయిర్ పోర్టు అధికారులు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ చైనా భూభాగంలోని అని.. అందువల్ల ఈ పాస్ పోర్ట్ చెల్లదని వాంగ్ జోమ్ ను ఇబ్బందులకు గురిచేశారు అక్కడి అధికారులు. దాంతో ఇరు దేశాల మధ్య ఈ సంఘటన తీవ్ర చర్చనీయాశంగా మారింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. చైనాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చైనా తన వీసా పాలసీ రూల్స్ ను బ్రేక్ చేయడమే కాకుండా ఇంటర్నేషన్ ఎయిర్ ట్రావెల్ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించిందని భారత్ మండిపడింది. ఇదే విషయంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. చైనాలోని షాంఘై పుడాంగ్ ఎయిర్ పోర్టులో భారత్ కు చెందిన ప్రయాణికురాలు ప్రేమ వాంగ్ జోమ్ ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. చైనా అమలు చేస్తున్న 24 గంటల వీసా ఫ్రీ ట్రాన్సిట్ పాలసీ అన్ని దేశాలకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఇక అరుణాచల్ ప్రదేశ్.. భారత భూభాగంలోనిదేనని స్పష్టం చేశారు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్. అరుణాచల్ భారత్ లో ఇంటెగ్రల్ పార్టు అని అలాగే విడదీయరాని ప్రాంతం అని తెలిపారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరం, ఈశాన్యం భాగంలో చైనా సరిహద్దును కలిగిఉంది.












Click it and Unblock the Notifications