శ్రీదేవి మృతి: జడ్జి పాత్ర, భారతీయ మీడియాపై ఆగ్రహం

న్యూఢిల్లీ: ప్రతి విషయంలోనూ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడం మామూలు వ్యవహారంగా మారింది. పుకార్లను ప్రాతిపదికగా తీసుకుని అవే వాస్తవాలు అన్నట్లుగా వార్తకథనాలను వండి వారుస్తున్నాయి..

Recommended Video

    Sridevi Passes Away: It's Not A Cardiac Arrest, Twist ?

    దానికి ప్రధాన కారణం పరస్పర పోటీ. దానికి తోడు మీడియా చానెళ్లు అయితే టిఆర్పీ రేటింగ్ కోసం ఆ పనిచేస్తూ ఉన్నాయి. శ్రీదేవి మృతి విషయంలోనూఅదే జరుగుతోంది. అయితే, ఈ విషయంలో భారతీయ మీడియాపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

    భారతీయ మీడియాపై విమర్శలు

    భారతీయ మీడియాపై విమర్శలు

    దుబాయ్‌లో శ్రీదేవి మరణానికి సంబంధించిన వార్తాకథనాలను మొదటి నుంచీ వరుసగా ఇ్తు్న స్థానిక మీడియా సంస్థ ఖలీజ్ టైమ్స్ భారతీయ మీడియా తీరును తప్పు పట్టింది. శ్రీదేవి మృతిపై ముందుగానే నిర్ణారణలకు వచ్చేందుకు, న్యాయమూర్తి పాత్ర పోషించేందుకు భారత మీడియాలోని కొన్ని సెంగ్మెట్లు ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించింది.

    జడ్జీల పాత్ర పోషించేందుకు

    జడ్జీల పాత్ర పోషించేందుకు

    భారతీయ నటి శ్రీదేవి మృతి తమను కూడా దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఎందుకు ఈ కేసులో ముందుగానే ఓ నిర్దారణకు వచ్చేందుకు తాపత్రయపడుతున్నారని, మన సెలబ్రటీ ప్యాకెడ్ కల్చర్లో భాగంగా భరతీయ మీడియాలోని కొన్ని సెగ్మెంట్లు - అధికారులు దర్యాప్తును ముగించక ముందే జడ్జీల పాత్ర పోషించాలని భావిస్తున్నాయని ఖలీజ్ టైమ్స్ వ్యాఖ్యానించింది.

    సంయమనం పాటించాలని సూచన

    సంయమనం పాటించాలని సూచన

    శ్రీదేవి మృతి విషయంలో సత్యమేమిటో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన, బాత్ టబ్‌ల మునిగిపోవడం వల్ల ఆమె మరణించిందని ఫోరెన్సిక్ నివేదిక తెలిపిందని, ఐ విచారణ సమయంలో సంయమనం పాటించడమే ధర్మమని తాము భారతీయ మీడియాకు సూచిస్తున్నామని ఖలీజ్ టైమ్స్ అన్నది.

    టీవీ చానెళ్ల తీరుపై...

    టీవీ చానెళ్ల తీరుపై...

    శ్రీదేవి మృతి విషయంలో టీవీ చానెళ్ల ప్రసారాల తీరును ప్రముఖ జర్నలిస్టు బర్ఖా ద్ తప్పు పట్టారు. టీవీ చానెళ్ల తీరు సిగ్గుపడేలా ఉందని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై మె వాషింగ్టన్ పోస్టులో ఓ కథనాన్ని రాశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+