Ganja: వారు చదివేది మెడిసిన్.. కానీ చేసే పని మాత్రం..
పది మందికి మంచి చెప్పాల్సిన మెడిసిన్ విద్యార్థులు తప్పుదోవ పట్టారు. గంజాయి వాడుతూ, అమ్ముతూ పోలీసులకు చిక్కారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది. అరెస్టయిన వారు నగరంలోని నాలుగు మెడికల్, డెంటల్ కాలేజీలకు చెందిన వారని మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ మీడియాకు తెలిపారు.

మెడికల్ ఆఫీసర్
నిందితుల్లో కేరళకు చెందిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సమీర్ (32), కేరళకు చెందిన ఎంబీబీఎస్ ఇంటర్నీ డాక్టర్ నదియా సిరాజ్ (24), ఆంధ్రప్రదేశ్‌కి చెందిన డాక్టర్ వర్షిణి ప్రతి (26), తమిళనాడుకు చెందిన మెడికల్ సర్జన్ డాక్టర్ మణిమారన్ ముత్తు (28), తృతీయ సంవత్సరం ఎండీ ( చండీగఢ్‌కు చెందిన సైకియాట్రీ) విద్యార్థి డాక్టర్ భాను ధహియా (27), నాల్గవ సంవత్సరం BDS విద్యార్థిని డాక్టర్ రియా చద్దా, ఢిల్లీకి చెందిన మూడవ సంవత్సరం MS ఆర్థో విద్యార్థి డాక్టర్ క్షితిజ్ గుప్తా (25), పునా నుండి MBBS విద్యార్థి డాక్టర్ ఇరా బాసిన్ (23), బంట్వాళలోని మరిపళ్లకు చెందిన మహ్మద్ రవూఫ్ అలియాస్ గౌస్ (34) ఉన్నారు.

నీల్ కిషోరిలాల్ రామ్‌జీ
జనవరి 7న, బంట్స్ హాస్టల్‌లోని ఒక ఫ్లాట్‌లో గంజాయి పట్టుబడింది. UK పౌరసత్వం ఉన్ననీల్ కిషోరిలాల్ రామ్‌జీ షా (38) ప్లాట్ లో గంజాయ్ దొరకడంతో అరెస్ట్ చేశారు. గరంలోని ఓ డెంటల్ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అతను కోర్సు పూర్తి చేయలేకపోవడంతో వైద్య, డెంటల్ కళాశాలల్లోని ఇతర విద్యార్థులకు గంజాయి విక్రయించేవాడు.

సింథటిక్ డ్రగ్స్
ఇలా చాలా మంది వైద్య విద్యార్థులకు గంజాయి అలవాటు చేశాడు. ఇతడిని పోలీసులు విచారించగా ఎవరికి గంజాయి అమ్మాడో తేలింది. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, రెండు రోజుల పోలీసు కస్టడీ విధించారు. నిందితుల నుంచి 50 వేల విలువైన 2 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక బొమ్మ పిస్టల్, ఒక బాకు, రూ. 7,000 నగదు, డిజిటల్ వెయిటింగ్ స్కేల్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారు గంజాయితో పాటు ఎండీఎంఏ, సింథటిక్ డ్రగ్స్ కూడా సేవించారు. వారు వేర్వేరు పీజీ గృహాలు, అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో నివసిస్తున్నారు.












Click it and Unblock the Notifications