భర్తను చంపి మంచంపై పాము: భార్య, ప్రియుడికి ఉరిశిక్ష

ఉత్తరప్రదేశ్‪లోని మీరట్‌‌లో సంచలనం సృష్టించిన భర్త దారుణ హత్య కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. కట్టుకున్న భర్తను దారుణంగా గొంతునులిమి హత్యచేసి.. ఆపై నేరాన్ని పాముకాటుతో మరణించినట్లు చిత్రీకరించేందుకు యత్నించిన భార్య రవిత, ఆమె ప్రియుడు అమర్‌దీప్‌లకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మీరట్‌లోని ఏడీజే-12 కోర్టు న్యాయమూర్తి జైవీ‌ర్‌సింగ్ నగర్ శుక్రవారం ఈ కేసుపై విచారణ చేపట్టి నేరానికి పాల్పడిన నిందితులకు ఈ కఠిన శిక్షను ఖరారు చేశారు. జైలులో ఉన్న నిందితులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ విచారణకు హాజరయ్యారు.

Meerut Blue Drum Murder Case: బ్లూ డ్ర‌మ్ మ‌ర్డర్ కేసు.. భార్య‌, ఆమె ప్రియుడికి మ‌ర‌ణశిక్ష
Meerut Blue Drum Murder Case: బ్లూ డ్ర‌మ్ మ‌ర్డర్ కేసు.. భార్య‌, ఆమె ప్రియుడికి మ‌ర‌ణశిక్ష

ఈ దారుణ ఘటన 2025 ఏప్రిల్ 12న మీరట్లోని బహసుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్‌పూర్ సదాత్ గ్రామంలో చోటుచేసుకుంది. రవిత తన ప్రియుడు అమర్‌దీప్‌తో కలిసి భర్త అమిత్ కశ్యప్‌ను రాత్రి వేళ గొంతునులిమి హత్య చేసింది. అనంతరం ఈ మరణం పాము కాటు వల్ల జరిగిందని నమ్మించడానికి ఓ పామును తెచ్చి అమిత్ మంచంపై వదిలేశారు. అయితే మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో అసలు నిజం బయటపడింది. అమిత్ మరణానికి కారణం పాము కాటు కాదని, గొంతు నులమడం వల్లే శ్వాస ఆడక చనిపోయాడని వైద్యులు స్పష్టం చేశారు.

Meerut Snake Murder Case Wife Lover Sentenced to Death for Killing Husband Full Details Here

పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అనుమానంతో పోలీసులు భార్య రవితను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు కాల్ డేటాను పరిశీలించగా.. హత్య జరిగిన రోజే భార్య రవిత, ఆమె ప్రియుడు అమర్‌దీప్‌ల మధ్య 50 కంటే ఎక్కువ సార్లు ఫోన్ సంభాషణలు జరిగినట్లు తెలిసింది. ఈ సాక్ష్యాల ఆధారంగా పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

రూ. 6.30 లక్షల ధర.. 35కిలోమీటర్ల మైలేజ్: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఫ్యామిలీ కార్!
రూ. 6.30 లక్షల ధర.. 35కిలోమీటర్ల మైలేజ్: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఫ్యామిలీ కార్!

సుదీర్ఘ విచారణ అనంతరం అక్టోబర్ 7న కోర్టు రవిత, అమర్‌దీప్‌లను దోషులుగా నిర్ధారించింది. శుక్రవారం(అక్టోబర్ 16) ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితుల నేరానికి మరణశిక్షే సరైనదని సంచలన తీర్పు ఇచ్చింది. ఇటీవల మీరట్‌లో చోటుచేసుకున్న బ్లూ డ్రమ్ మర్డర్ కేసు(సౌరభ్ హత్య కేసు)లో ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్‌లకు అక్టోబర్ 14న కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ తీర్పు వచ్చిన కొద్ది రోజులకే మీరట్ న్యాయస్థానంలో ఇది రెండో మరణశిక్ష కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+