‘బిచ్చగాడు’ సినిమా రియల్ లైఫ్ వెర్షన్.. తల్లి కోసం 16 వేల కి.మీ. పరుగు

బిచ్చగాడు సినిమాలో తల్లి ఆరోగ్యం బాగుపడాలంటే ఎవరికీ చెప్పకుండా 41 రోజులు బిచ్చమెత్తుకొని బతకాలని బాగా సంపన్నుడైన హీరోకు ఓ స్వామీజీ చెబుతారు. దీంతో హీరో ఎన్ని కష్టాలెదురైనా అలాగే చేసి తన తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు. అది సినిమా. కానీ వాస్తవ జీవితంలో కూడా అలాంటి సంఘటనే ఇప్పుడు జరుగుతోంది. కన్నతల్లి ఆరోగ్యం కోసం దేశంలోని 12 జ్యోతిర్లింగాలు, చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలను పరుగెడుతూ సందర్శిస్తూ ఒక యువకుడు సాగిస్తున్న అసాధారణ ఆధ్యాత్మిక ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

నిరసనల్లో పాల్గొన్న హీరో ఇమ్రాన్ ఖాన్ కు పోలీసుల షాక్- దేశ బహిష్కరణ ఆదేశాలు..!
నిరసనల్లో పాల్గొన్న హీరో ఇమ్రాన్ ఖాన్ కు పోలీసుల షాక్- దేశ బహిష్కరణ ఆదేశాలు..!

కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఆ యువకుడిని అందరూ కలియుగ 'శ్రవణ కుమారుడు' అని కొనియాడుతున్నారు. ఈ సాహసయాత్ర చేస్తున్న యువకుడి పేరు మోను బేతౌరా. బీహార్‌లోని పాట్నా జిల్లాకు చెందిన ఈ 19 ఏళ్ల కుర్రాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇతనికి చిన్నప్పటి నుంచి పరుగు అంటే చాలా ఇష్టం. ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం, శారీరక దృఢత్వం ఉండటంతో స్థానికంగా అతన్ని అందరూ "బ్లాక్ పాంథర్" అని పిలుస్తుంటారు.

Monu Betaura Real-Life Bichagadu Moment Man Takes on a 16000 KM Journey for His Mother

దేవుడికి మొక్కుకున్న మోను

కొంతకాలం క్రితం మోను తల్లి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డారు. ఎంత ఆసుపత్రిలో చూపించినా ఆరోగ్యం కుదుటపడలేదు. ఆమె కోలుకోవడం కష్టమని డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. ఆ క్లిష్ట సమయంలో కన్నతల్లిని కాపాడుకోవడానికి ఆ కొడుకు దేవుడిని నమ్ముకున్నాడు. "మా అమ్మ గనుక కోలుకుని మళ్లీ ఇంటికి వస్తే.. దేశంలోని 12 జ్యోతిర్లింగాలను పరుగున వెళ్లి దర్శించుకుంటాను" అని భోళాశంకరుడికి మొక్కుకున్నాడు. ఆ దేవుడి దయవల్ల, డాక్టర్ల చికిత్సతో తల్లి అద్భుతంగా కోలుకున్నారు.

హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్‌ స్టార్ హీరో కుమార్తె.. ఫస్ట్‌ లుక్‌ చూస్తే మతి పోవాల్సిందే..!
హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్‌ స్టార్ హీరో కుమార్తె.. ఫస్ట్‌ లుక్‌ చూస్తే మతి పోవాల్సిందే..!

కోలుకున్న తల్లి, యాత్ర మొదలు

ఇచ్చిన మాట ప్రకారం తల్లి ఆరోగ్యంగా మారగానే మోను తన యాత్రను మొదలుపెట్టాడు. 2026 మార్చి 15న పాట్నాలో బయలుదేరి, మొదట జార్ఖండ్‌లోని బాబా బైద్యనాథ్ ధామ్‌ను దర్శించుకున్నాడు. రోజూ నడవకుండా పరుగు పెడుతూ రోజుకు దాదాపు 50 కిలోమీటర్ల దూరం వెళ్తున్నాడు. 12 జ్యోతిర్లింగాలతో పాటు చార్‌ధామ్ యాత్రను కూడా పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. మొత్తం 16 వేల కిలోమీటర్ల ఈ ప్రయాణంలో ఇప్పటికే దాదాపు 8 వేల కిలోమీటర్లకు పైగా పరుగును విజయవంతంగా పూర్తి చేయడం విశేషం.

తల్లిదండ్రులను పట్టించుకోండి

చేతిలో త్రిశూలం లేదా జాతీయ జెండా పట్టుకుని, వెనుక చిన్న బ్యాగ్‌తో మోను హైవేలపై పరుగు తీస్తున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఎండ, వాన, కాళ్లకు బొబ్బలు ఎక్కినా లెక్కచేయకుండా అతను ముందుకు సాగుతున్నాడు. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు స్థానిక ప్రజలు, భక్తులు అతనికి ఘన స్వాగతం పలికారు. దారిలో చాలామంది అతనికి భోజనం పెట్టి, రాత్రికి వసతి కల్పిస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు డ్యూటీలో ఉన్న పోలీసులు కూడా అతని మాతృభక్తిని చూసి ఆశ్చర్యపోయి, పరుగు ఆపి మరీ అభినందిస్తూ సెల్యూట్ చేస్తున్నారు. 'నేను ఈ యాత్ర నా స్వార్థం కోసం చేయడం లేదు.. నా మాతృధర్మం కోసం, దేశంలోని తల్లులందరి కోసం, యువతలో స్ఫూర్తి నింపడం కోసం చేస్తున్నాను' అని మోను చెబుతున్నాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులను పట్టించుకోని కొందరికి, మోను చూపుతున్న ఈ మాతృప్రేమ నిజంగా ఒక పెద్ద పాఠంలాంటింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+