6 నెలల్లో 140 ఆకతాయిల అరెస్ట్: లైంగిక వేధింపులపై దీపేష్ పోరాటం

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: రైల్వే స్టేషన్‌లో మహిళలపై వేధింపులకు పాల్పడే రౌడీలకు సామాజిక వేత్త దిపేష్ తంక్ కొరకరాని కొయ్యగా మారాడు. 6 మాసాల కాలంలో రైల్వేస్టేషన్లలో సుమారు 140 మంది ఆకతాయిలను పోలీసులకు పట్టించాడు. మహిళలకు రక్షణ కల్పిస్తున్నాడు.

సామాజిక వేత్త అయిన దిపేష్‌ తంక్‌ ఉదయాన్నే లేచి ముంబై రైళ్లు, రైల్వే స్టేషన్‌లలో సంచరిస్తూ కనిపిస్తుంటారు. ఎక్కడైనా ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తూ కనిపిస్తే చాలూ కాసేపు వారినే ఆయన తదేకంగా చూస్తుంటారు. ఆపై వారి దగ్గరి కెళ్లి ఆ చేష్టలను అడ్డుకుంటారు.

Meet Mumbai's hero who helped nab over 140 'railway rowdies' in 6 months

ఆకతాయిలు అమ్మాయిలనే వేధిస్తున్న దృశ్యాలను దీపేష్ తన కళ్ళజోడులో భద్రపర్చిన కెమెరాలో రికార్డ్ చేస్తాడు. అమ్మాయిలను వేధించే వారిని మాత్రమే కాదు.. రైళ్ల నుంచి తిక్క చేష్టలు చేసే వారిని కూడా ఆయన చిత్రీకరిస్తారు.

గత 6 నెలలుగా దీపేష్‌తంక్ సుమారు 140 మందిని సాక్ష్యాలతోసహా ఆయన పోలీసులకు పట్టించారు. జైలుకు వెళ్లి వచ్చిన కొందరు తనను చంపుతామని బెదిరించారని దీపేష్ తంక్ చెబుతారు. మహిళలపై వేధింపులు ఆగేంతవరకు తాను ఇలాగే వ్యవహరిస్తాననంటున్నారు దీపేష్ తంక్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
This inspiring story comes at a time when social media is filled up with heart-wrenching posts of #MeToo where women from all walks of life have joined the social media movement sharing their stories of sexual harassment.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి