వివాదాలపై కేంద్రం భేటీ: అడిగిన టీ, తెగేసి చెప్పిన ఏపీ
హైదరాబాద్: సమస్యల పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వివాదం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో హోంశాఖ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాల అంశం చర్చకు రాలేదని తెలుస్తోంది. కృష్ణానది బోర్డు నిర్వహణను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాలు కోరాయి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని ఇరు రాష్ట్రాల సీఎస్‌లు విడివిడిగా కలిశారు. పీపీఏల పైన తెలంగాణ రాష్ట్రం స్పష్టత కోరింది. ఈ ఆర్సీ ఆమోదం పొందని పీపీఏలను అనుమతించేది లేదని ఏపీ ప్రభుత్వం తెగేసి చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మలు పాల్గొన్నారు.

ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ గోస్వామితో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు భేటీ అయ్యారు. విభజన తర్వాత తలెత్తిన అంశాలు, అధికారుల విభజన కేటాయింపులు, కృష్ణాజలాలు, విద్యుత్ సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. విద్యుత్, పీపీఏలు, నీరు, గవర్నర్‌కు అధికారాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ తదితర వివాదాలు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నాయి. వీటి పైన హోంశాఖ కార్యాలయంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications