వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

100మీటర్ల లోయలో పడిన బస్సు: 10 మంది మృతి

|
Google Oneindia TeluguNews

షిల్లాంగ్‌: మేఘాలయలోని తూర్పు జైనిటా హిల్స్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అస్సా రాజధాని గౌహతి నుంచి మేఘాలయ మీదుగా హైలకండి వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు టాంగ్‌సెంగ్‌ వద్ద 100 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది.

ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Meghalaya bus accident leaves 10 dead, several injured

ఆ వస్తువు యుద్ధ విమానం నుంచి పడిందా?

రాజస్థాన్ లోని బార్మర్ ప్రాంతంలో యుద్ధ విమానాల నుంచి కొన్ని వస్తువులు జారిపడ్డట్లు తెలుస్తోంది. గ్రామస్తుల సమాచారం మేరకు విచారణ నిమిత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారుల బృందం ఆ ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. గుగ్డి గ్రామంపై నుంచి అతి తక్కువ ఎత్తులో ఈ యుద్ధ విమానాలు ప్రయాణించాయని, వాటి నుంచి జారి పడ్డ వస్తువుల తాకిడికి కొన్ని గృహాలు కూడా దెబ్బతిన్నాయని గ్రామస్తులు చెప్పినట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. యుద్ధవిమానాలు వెళ్లడంతో విపరీతంగా దుమ్ము లేచి, పెద్ద శబ్దం వచ్చిందని గుగ్డి గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

English summary
Ten people were killed early on Tuesday when a bus going towards Assam’s Hailakandi district rolled down a hill in Meghalaya, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X