చోక్సి.. దుబాయ్‌లో ఆస్తులు, బెంజ్ కారు సీజ్

న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్షార్షియంకు రూ.13 వేల కోట్ల ఎగనామం పెట్టి పారిపోయిన నీరవ్ మోడీ, అతని అంకుల్ మొహుల్ చోక్సీల ఆస్తుల సీజ్ ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా చోక్సీ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. దుబాయ్‌లోని ఆయన మూడు స్థలాలు, మెర్సిడెజ్ బెంచ్ కారును స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. వీటి విలువ రూ.24 కోట్లు ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు.

Mehul Choksis Dubai Properties, Mercedes Car Seized

ఆస్తుల జప్తు ..
వీటితోపాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర విలువైన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. పంజాబ్ బ్యాంకుల కన్షార్షియంను మోసం చేసినందుకు మనీ ల్యాండరింగ్ చట్టం కింద ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతుందని వివరించింది. మొహుల్ చోక్సీ అక్రమంగా రూ.6 వేల కోట్ల పైచిలుకు సంపాదించాడు. అయితే ఇప్పటికే రూ.2534 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసినట్టు అధికారులు తెలిపారు.

నీరవ్, మొహుల్ చోక్సీల బండారం బయటపడకముందే వారు విదేశాలకు పలాయనం చిత్తగించారు. గతేడాది జనవరిలో అంటిగ్వా చేరుకున్నారు. కొద్దిరోజుల తర్వాత ఆ దేశ పౌరసత్వం కూడా పొందారు. అయితే అతనికి పలురకాల ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. హృదయ సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. దీంతోపాటు మెదడులో రక్తం గడ్డకట్టింది. దీంతో అతను విదేశాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. అయితే ఆర్థిక నేరస్తులకు తమ దేశం సురక్షితం కాదని, తాము ఉపేక్షించబోమని గత నెలలో అంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రోన్ పేర్కొన్నారు. చోక్సి పౌరసత్వాన్ని కూడా రద్దు చేస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ముందుకుసాగుతామని వివరించారు. మరికొద్దిరోజుల్లోనే అతని ఇండియా పంపిస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+