జగన్నాధాలయంలో దివ్యాంగురాలిపై అత్యాచారం,నిందితుడినిలా..
ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాథ ఆలయంలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. శుక్రవారం నాడు రాత్రిపూట గుడిలో 11 ఏళ్ళ మైనర్ దివ్యాంగురాలిపై అత్యాచారం చేశారు
భువనేశ్వర్:ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాథ ఆలయంలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. శుక్రవారం నాడు రాత్రిపూట గుడిలో 11 ఏళ్ళ మైనర్ దివ్యాంగురాలిపై అత్యాచారం చేశారు.
రాత్రిపూట గుడిని మూసివేసే సమయంలో దేవుడి దర్శనం కోసం దివ్యాంగురాలు గుడికి వచ్చింది. అయితే గుడిలో ఆ సమయంలో ఉన్న 28 ఏళ్ళ యువకుడు సహయం చేస్తానని నమ్మించి ఆ యువతిని స్నానాల గదికి తీసుకెళ్ళాడు.

స్నానాల గదిలో అత్యాచారం చేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కటక్ ఆసుపత్రికి తరలించారు.
బారిపాడా సబ్ కలెక్టర్ పురోహిత్ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి బాధితురాలిని పరామర్శించారు. వైద్య చికిత్స కోసం రూ.10వేలు అందజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు












Click it and Unblock the Notifications