• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రూ.10కోట్లివ్వండి లేదా సెక్స్‌టేప్ బయటపెడ్తా: మంత్రికి గన్‌మన్ బెదిరింపు!

|

బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన తాజా మాజీ మంత్రి హెచ్‌వై మేటి రాసలీలల కేసులో మరో ఆసక్తికరమైన అంశం వెలుగుచూసింది. మేటి గన్‌మన్ సుభాష్ ముగల్ఖోడ్.. ఈ రాసలీల వీడియో తీసినట్లు సమాచారం. అంతేగాక, ఈ వీడియోను బయటపెట్టకుండా ఉండాలంటే రూ. 10కోట్లు చెల్లించాలంటూ మంత్రిని ఆయన డిమాండ్ చేసినట్లు తెలిసింది.

బగల్కోట్‌లోని జిల్లా ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆస్పత్రికి మసాజ్ చేయించుకున్న సమయంలో సుభాష్ ఈ వీడియో తీశాడు. ఈ కారణంగానే డిస్ట్రిక్ట్ ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ తనకు గన్‌మన్‌గా అవసరం లేదని మంత్రి చెప్పినట్లు తెలిసింది.

కాగా, మంత్రికి మసాజ్ చేసిన మహిళ విజయలక్ష్మితో మంత్రి శారీరక సంబంధం ఏర్పరచుకున్నట్లు అక్కడి వర్గాలు తెలిపాయి. కాగా, కొందరి ఒత్తిడి వల్లే తాను మంత్రిపై లైంగిక ఆరోపణలు చేశానని ఆమె చెప్పడం గమనార్హం. అంతేగాక, తాను అలా చెప్పకపోతే తనను చంపుతానని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Meti sex tape: Give me Rs 10 crore or else... Did gunman blackmail minister?

ఇది ఇలా ఉండగా, సెక్స్ వీడియోలను బయటపెడతానని సుభాష్ తాజా మాజీ మంత్రి మేటీని బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలిసింది. మేటీ.. ఎక్సైజ్ మంత్రి అయిన తర్వాత రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన సుభాష్.. ఆ తర్వాత రూ. 10కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే, సెక్స్ టేప్ వీడియోలు బయటపడిన తర్వాత సుభాష్ పరారీలో ఉండటం గమనార్హం.

అయితే, ఐదేళ్లుగా ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో కంట్రాక్ట్ బేసిస్ పై పని చేస్తున్న విజయలక్ష్మిని పదోన్నతి పేరుతో లోబర్చుకుని మేటీ.. తన కోర్కెలు తీర్చుకున్నాడని పలువురు పేర్కొంటున్నారు. కాగా, మేటీకి ఆ మహిళ దూరపు బంధువని, అందుకే ఆమె సరిగా పని చేయకపోయినా ఎవరూ ఫిర్యాదు చేయకపోయేవారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఆమె విధులకు కూడా సమయానికి రాకపోయేదని, వచ్చినా విధులు నిర్వహించకపోయేదని వెల్లడించాయి.

కాగా, సెక్క్ స్కాండల్ బయటపడిన తర్వాత కడుపునొప్పి అంటూ విజయలక్ష్మి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వైద్యుల సూచన మేరకు తాను మంగళవారం డిశ్చార్జ్ అయ్యానని తెలిపింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former minister , H Y Meti’s gunman, Subhas Mugalkhod, recorded the sex video that cost him his position, according to sources. While Mr Meti has denied the district armed reserve policeman ever worked for him as gunman, sources say he was in his employment and secretly made a video recording of his visits to the district government Ayurvedic hospital in Bagalkote for massages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more