సైరస్ మిస్త్రీ మరణంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశం: బాధగా ఉందన్న ఫడ్నవీస్
ముంబై: టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతికి కారణమైన రోడ్డు ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని హోం శాఖను నిర్వహిస్తున్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు వార్తా సంస్థ పీటీ నివేదించింది.
Recommended Video
ముంబైకి ఆనుకుని ఉన్న పాల్ఘర్ సమీపంలో జరిగిన దురదృష్టకర ప్రమాదంలో మిస్త్రీ (54) మరణించిన విషయం తెలిసి తాను షాక్ అయ్యానని, చాలా బాధపడ్డానన్నారు ఫడ్నవీస్. తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఫడ్నవీస్.. "డీజీపీతో మాట్లాడాను, సమగ్ర దర్యాప్తు కోసం ఆదేశించాను' అని పేర్కొన్నారు. మిస్త్రీ కుటుంబసభ్యులకు, మిత్రులకు, సహోద్యోగులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని తెలిపారు.

ముంబై సమీపంలోని పాల్ఘర్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా గ్రూప్ మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ మరణించారు. ప్రమాదం తర్వాత, మిస్త్రీని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మిస్త్రీతోపాటు ఒకరు మరణించగా.. మరో ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు. వారిని గుజరాత్‌లోని ఆసుపత్రికి తరలించారు.
పీటీఐ కథనం ప్రకారం.. మిస్త్రీ మెర్సిడెస్ కారులో అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళుతుండగా మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మిస్త్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాసా గ్రామీణ ఆసుపత్రికి తరలించారు.
Shocked and deeply pained to know about the demise of Former Chairman of Tata Sons Shri Cyrus Mistry in an unfortunate accident near Palghar.
— Devendra Fadnavis (@Dev_Fadnavis) September 4, 2022
My deepest condolences to his family, friends and colleagues.
ॐ शान्ति 🙏
Spoke to DGP and instructed for detailed investigations. pic.twitter.com/1v0FiAEAtw
మిస్త్రీ మృతి ప్రపంచ వాణిజ్య, పారిశ్రామిక రంగానికి తీరని లోటు అని ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. కాగా, మిస్త్రీ కుటుంబసభ్యులు, స్నేహితులకు నివాళులర్పిస్తూ సోషల్ మీడియా మెసేజ్‌లు వెల్లువెత్తాయి. ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామిక ప్రముఖులు వ్యాపారవేత్త మృతికి సంతాపం తెలిపారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications