ఆ ముగ్గురు ఎస్పీలను ఢిల్లీకి పంపండి.. బెంగాల్ సర్కార్‌కు హోం శాఖ ఆదేశాలు..
బెంగాల్‌లో బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడిపై రగడ కొనసాగుతూనే ఉంది. ఘటనపై నివేదిక ఇవ్వాలని హోం శాఖ కోరగా.. అందుకు బెంగాల్ ప్రభుత్వం తోసిపుచ్చింది. దీనిపై కేంద్ర హోం శాఖ మరో స్టెప్ ముందుకు తీసుకుంది. నడ్డా పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న ముగ్గురు ఐపీఎస్‌లను డిప్యూటేషన్‌పై పంపాలని కోరింది. దీనిపై దీదీ ప్రభుత్వం ఎలా స్పందిస్తోందో చూడాలీ మరీ.
నడ్డా పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న డైమండ్ హర్బర్ ఎస్పీ భోలానాథ్ పాండే, దక్షిణ బెంగాల్ ఏడీజీ రాజీవ్ మిశ్రా, ప్రెసిడెన్సీ రేంజ్ డీఐజీ ప్రవీణ్ త్రిపాఠీలను కేంద్ర సర్వీసులకు పంపాలని హోంశాఖ కోరింది. నడ్డా పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న ఈ ముగ్గురే దాడికి బాధ్యత వహించాలని కేంద్రం అంటోంది. ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారుల డిప్యూటేషన్‌కి సంబంధించి బెంగాల్ ప్రభుత్వానికి సమాచారం అందజేశామని తెలిపింది.

ఐపీఎస్‌లను కేంద్ర సర్వీసులోకి రావాలని కేంద్రం కోరడం ఇదీ రెండోసారి. ఇదివరకు బెంగాల్ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా డిప్యూటేషన్ రావాలని కోరిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ సీఎం మమతా బెనర్జీ ధర్నా చేయగా.. సీపీ కూడా కూర్చొన్నారు. ఇదీ అప్పట్లో దుమారం రేపింది. కేంద్ర హోంశాఖకు రిపోర్ట్ చేయాలని ఎన్నికల సంఘం కూడా సీపీని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఐపీఎస్ అధికారులు రాష్ట్రాల్లో పనిచేసేందుకు మక్కువ చూపుతారు. కేంద్ర సర్వీసు అంటే పనిష్ మెంట్ అని కొందరు ఐపీఎస్ అధికారులు చెబుతున్నారు. అందుకోసమే సుముఖంగా ఉండరని చెప్పారు. ఈ క్రమంలో ముగ్గురు ఐపీఎస్‌లను డిప్యూటేషన్ కోరడం చర్చకు దారితీసింది.












Click it and Unblock the Notifications