Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పార్లమెంట్‌లో దుశ్చర్య: విచారణకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశం, సీఆర్పీఎఫ్ చీఫ్ నేతృత్వం

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. సీఆర్పీఎఫ్ డీజీ అనీష్ దయాళ్ సింగ్ ఆధ్వర్యంలో ఇతర భద్రతా సంస్థలు, నిపుణులతో ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. పార్లమెంటు భద్రతకు విఘాతం కలిగించడానికి గల కారణాలపై దర్యాప్తు ప్యానెల్ దర్యాప్తు చేసి, లోపాలను గుర్తించి తదుపరి చర్యలను సిఫారసు చేస్తుంది.

పార్లమెంట్‌లో భద్రతను మెరుగుపరచడంపై సూచనలతో సహా సిఫారసులతో కూడిన నివేదికను విచారణ కమిటీ త్వరగా సమర్పిస్తుంది అని కేంద్ర హోం వ్యవహారాల శాఖ తెలిపింది. కాగా, బుధవారం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్‌సభలోని సందర్శకుల గ్యాలరీ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు కిందకు దూకడంతో భద్రతా వైఫల్యం జరిగింది. చొరబాటుదారులు గ్యాస్‌ డబ్బాలు పట్టుకుని సభలోనే నినాదాలు చేశారు.

MHA Orders Probe Into Parliament Security Breach, CRPF Chief to lead Investigation Panel

విచారణ సందర్భంగా రైతుల సమస్యలు, మణిపూర్ సంక్షోభం, నిరుద్యోగం వంటి సమస్యలతో విసిగిపోయి ఈ చర్యకు పాల్పడ్డారని నిందితులు అమోల్ చెప్పారు. ఈ నిందితులందరికీ ఒకరికొకరు గత నాలుగేళ్లుగా తెలుసని పోలీసులు తెలిపారు. పక్క ప్రణాళికతోనే పార్లమెంటుపై దుశ్చర్యకు పాల్పడ్డారని వెల్లడించారు.

ఆరుగురు నిందితుల పాత్ర: ఐదుగురి అరెస్ట్

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ బుధవారం లోక్‌సభ (Lok Sabha)లోకి దూసుకొచ్చిన ఘటనలో మొత్తం ఆరుగురి పాత్ర ఉన్నట్లు తేల్చారు పోలీసులు. మొదట నలుగురు నిందితులే అనుకున్నప్పటికీ తాజాగా మరో ఇద్దరి పాత్ర కూడా ఉందని తేలింది. కాగా, ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

దుండగులు పక్కా ప్రణాళిక, పరస్పర సమయంతోనే ఈ దాడి తరహా ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులందరికీ నాలుగేళ్లుగా పరిచయం ఉందని, కొద్ది రోజుల క్రితం రెక్కీ కూడా నిర్వహించారని పోలీసులు వర్గాలు తెలిపాయి. ఆరు నెలల క్రితమే ఈ దుశ్చర్యక ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నాయి.

పార్లమెంటు(Parliament) సమావేశాలు జరుగుతున్న లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించి ఎంపీలను భయాందోళనకు గురిచేసిన నిందితులు సాగర్ శర్మ, మనో రంజన్ లను అక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అమోల్ శిండే, నీలంను పార్లమెంట్ భవనం వెలుపల అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం వీరిని పోలీసులు విచారిస్తున్నారు.

ఈ ఇద్దరు నిందితులతోపాటు లలిత్, విక్రమ్ అనే మరో ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి. దీంతో విక్రమ్ ను గురుగ్రాంలో అదుపులోకి తీసుకోగా.. లలిత్ కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది. కాగా, పార్లమెంటుకు వచ్చే ముందు ఈ ఐదుగురూ గురుగ్రాంలోని విక్రమ్ ఇంట్లోనే ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ప్రణాళిక ప్రకారం ఆరుగురూ పార్లమెంటు లోపలికి వెళ్లాలనుకున్నప్పటికీ.. ఇద్దరికే విజిటర్ పాస్ లభించడంతో వారిద్దరే లోపలికి వెళ్లారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+