Midnight: ఇంటి బయట డోర్ లాక్ చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు, భార్య ప్రాణం పోయింది, ఏం జరిగింది?!
భువనేశ్వర్/ కెంజీహర్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. రాత్రి దంపతులు భోజనం చేసి కొంతసేపు టీవీ చూస్తూ కాలం గడిపారు. రాత్రి దంపతులు ఇద్దరూ నిద్రపోయారు. అర్దరాత్రి దాటిన తరువాత కొందరు దంపతులు నివాసం ఉంటున్న ఇంటి బయట డోర్ కు బయట గడియ పెట్టి వేరే తాళం వేశారు. కిటికీలో నుంచి ఇంట్లోకి పెట్రోల్ పోసిన నిందితులు నిప్పు పెట్టి పరారైనారు. ఇంటిలో మంటలు వ్యాపించడంతో దంపతులు ఆర్తనాదాలు చేశారు. దంపతులను కాపాడటానికి అవకాశం లేకుండా ఇంటి బయట లాక్ చెయ్యడం కలకలం రేపింది.

సంతోషంగా జీవిస్తున్న దంపతులు
ఒడిశాలోని కియోంఝూర్ జిల్లాలోని హరిచందన్ పూర్ ప్రాంతంలోని దగోతా గ్రామంలో ఉగ్రసేన్ అలియాస్ సేన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జయంతి అనే యువతిని ఉగ్రసేన్ వివాహం చేసుకున్నాడు. ఉగ్రసేన్, జయంతి దంపతులు చాలా సంతోషంగా కాపురం చేస్తున్నారు.

వ్యాపారం చేస్తున్న భర్త
ఉగ్రసేన్ వ్యాపారం చేస్తున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు ఉగ్రసేన్ ఎక్కువగా బయట ఉంటున్నాడు. భర్త ఉగ్రసేన్ వ్యాపారం చెయ్యడానికి బయటకు వెళ్లిన తరువాత అతని భార్య జయంతి ఇంటిలోనే ఉంటున్నది. పగలు ఇంట్లోనే ఉంటున్న జయంతి బంధువుల ఇళ్లకు వెళ్లి వస్తూ బయట తిరుగుతోందని తెలిసింది.

అర్దరాత్రి ఏం చేశారంటే?
రాత్రి ఉగ్రసేన్, జయంతి దంపతులు బంధువుల ఇంటికి వెళ్లి కొంతసేపు ఉన్నారు. తరువాత ఇంటికి చేరుకున్న ఉగ్రసేన్, జయంతి దంపతులు భోజనం చేసి కొంతసేపు టీవీ చూస్తూ కాలం గడిపారు. రాత్రి ఉగ్రసేన్, జయంతి దంపతులు ఇద్దరూ నిద్రపోయారు. అర్దరాత్రి దాటిన తరువాత కొందరు ఉగ్రసేన్, జయంతి దంపతులు నివాసం ఉంటున్న ఇంటి బయట డోర్ కు బయట గడియ పెట్టి వేరే తాళం వేశారు.

చుట్టుపక్కల ఇళ్లకు తాళం వేసిన నిందితులు
ఉగ్రసేన్ ఇంటి కిటికీలో నుంచి ఇంట్లోకి పెట్రోల్ పోసిన నిందితులు నిప్పు పెట్టి పరారైనారు. ఇంటిలో మంటలు వ్యాపించడంతో దంపతులు ఆర్తనాదాలు చేశారు. ఉగ్రసేన్, జయంతి దంపతులను కాపాడటానికి అవకాశం లేకుండా చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారి ఇళ్లకు బయట తాళం వెయ్యడంతో ఉగ్రసేన్, అతని భార్య జయంతిని వెంటనే రక్షించలేకపోయారు.

భార్య ప్రాణం పోయింది
ఉగ్రసేన్, జయంతి దంపతులు నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల బయట నిందితులు లాక్ చెయ్యడం కలకలం రేపింది. కొందరు ఉగ్రసేన్, జయంతి దంపతులను రక్షించి హరిచందన్ పూర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ కు తరలించారు. అక్కడి నుంచి ఎస్ సీబీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై జయంతి ప్రాణాలు పోయాయని పోలీసులు అన్నారు.

అసలు మ్యాటర్ తెలీదు
ఉగ్రసేన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. ఉగ్రసేన్, జయంతి దంపతులను ఎవరు సజీవదహనం చెయ్యాలని అనుకున్నారో కచ్చితంగా తెలీయడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే జయంతి, ఆమె భర్త ఉగ్రసేన్ ను ఒకేసారి ఎందుకు హత్య చెయ్యాలని అనుకున్నారు ? అనే విషయంపై రకరకాలుగా స్థానికులు మాట్లాడుకుంటున్నారని పోలీసు అధికారులు అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications