వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌తో యుద్దానికి అమెరికానే కారణం: చైనా

డోక్లామ్‌లో ఉద్రిక్తతల నడుమ భారత్‌కు మద్దతిస్తూ అమెరికన్ మీడియా ప్రచురించిన ఆర్టికల్‌పై చైనా విరుచుకుపడింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డోక్లామ్‌లో ఉద్రిక్తతల నడుమ భారత్‌కు మద్దతిస్తూ అమెరికన్ మీడియా ప్రచురించిన ఆర్టికల్‌పై చైనా విరుచుకుపడింది. రెండు దేశాల మధ్య యుద్దం వస్తే అమెరికానే కారణమని కూడ చైనా మీడియా ఆరోపణలు చేసింది.

భారత్-చైనాల మధ్య యుద్దం వస్తే అందుకు అమెరికానే కారణమని చైనా మీడియా ఆరోపణలు గుప్పించింది. అమెరికాకు చెందిన వాష్టింగ్టన్ 'ఎగ్జామినర్' తన ఎడిటోరియల్ కాలమ్‌లో 'ట్రంప్ మస్ట్ సపోర్ట్ ఇండియా అగెనెస్ట్ చైనా' అనే శీర్షిక పేరిట కథనాన్ని ప్రచురించింది.

అమెరికా ఎందుకు మద్దతివ్వాలో వివరిస్తూ దేశానికి వ్యతిరేకంగా తయారౌతున్న చైనాను అడ్డుకొనేందుకు అమెరికా భారత్‌కు మద్దతివ్వాలని సూచించింది.

Miffed at a US publication's support for India, Chinese media says 'US is instigating military clash between China, India'

ఈ కాలమ్‌ను చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ తప్పుబట్టింది. సమస్య ఎక్కడుంటే అక్కడ అమెరికా తలరూరుస్తోందని ఆ పత్రిక ఆరోపణలు చేసింది.

సమస్యలు తీర్చాలంటే నిష్ఫక్షపాత ధోరణి ఉండాలని ఆ పత్రిక సూచించించింది. అమెరికా మాత్రం భారత్-చైనాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేసింది. దక్షిణ చైనా సముద్రం అంశాన్ని కూడ తెరమీదికి తెచ్చి ప్రస్తావించింది.

అమెరికాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నానన్న ఉద్దేశం చైనా కాలమ్‌లో కన్పించింది. దక్షిణ చైనా సముద్రంలో కూడ అనవసర జోక్యం ప్రమాదకరమని అమెరికాను హెచ్చరించింది.

English summary
Miffed at a US article supporting India, China's state-backed media has accused Washington of trying to instigate a military clash between India and China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X