MiG-21 Farewell: ఘన వీడ్కోలుకు సిద్దమైన మిగ్ 21లు-ఆమెకు అరుదైన ఛాన్స్..!

పాకిస్తాన్ తో జరిగిన 1965, 1971 యుద్దాలు, 1999 నాటి కార్గిల్ వార్, 2019 నాటి బాలాకోట్ వైమానిక దాడుల్లో కీలక పాత్ర పోషించిన మిగ్ -21 యుద్ధ విమానాలు ఇక వీడ్కోలుకు సిద్ధమయ్యాయి. వీటికి అప్ గ్రేడ్ వెర్షన్లు, ఫీచర్లు వచ్చేయడంతో ఇక వాయుసేన నుంచి వాటిని తప్పించేందుకు రక్షణశాఖ రంగం సిద్ధం చేస్తోంది. రేపు చంఢీఘడ్ లో రక్షణమంత్రి రాజ్ నాధ్ సింగ్ సమక్షంలో జరిగే ఓ కార్యక్రమంలో మిగ్ 21లకు ఘన వీడ్కోలు పలకనున్నారు.

రేపే మిగ్ 21కు వీడ్కోలు

ప్రస్తుతం మిగ్ 21 పాంథర్స్ గా పిలిచే చివరి తరం 23వ నంబర్ స్క్రాడ్రన్ వెర్షన్ విమానాలను ఎయిర్ ఫోర్స్ వాడుతోంది. వీటికి
రేపు శుక్రవారం ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ 'బాదల్ 3' అనే కాల్ సైన్‌తో చివరిగా ఎగురవేస్తారు. ఈ కార్యక్రమంలో స్క్ర్వాడ్రన్ లీడర్ ప్రియాశర్మ కీలకంగా వ్యవహరించనున్నారు. ఆమె నిన్న మిగ్ 21 రిహార్సల్స్ లో పాల్గొన్నారు. రేపు జరిగే వీడ్కోలు కార్యక్రమంలోనూ ఆమె మిగ్ 21 విమానంలో విహరించబోతున్నారు. దీంతో ప్రియాశర్మ పేరు మార్మోగుతోంది.

MiG-21 Farewell Flypast Meet Squadron Leader Priya Sharma the IAF Pilot Making History

ప్రియాశర్మ వీడ్కోలు

రేపు జరిగే మిగ్ 21 వీడ్కోలు కార్యక్రమంలో 23వ నంబర్ స్క్వాడ్రన్‌కు చెందిన ఆరు జెట్‌లు ల్యాండింగ్ అయిన తర్వాత వాటర్ ఫిరంగులతో సెల్యూట్ అందుకుంటాయి. ఈ చారిత్రాత్మక క్షణంలో ప్రియ శర్మ కీలక పాత్ర పోషించనున్నారు. దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుండి 2018లో గ్రాడ్యుయేట్ అయిన ప్రియ శర్మ, భారత వైమానిక దళంలో ఏడవ మహిళా ఫైటర్ పైలట్. గతంలో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నుండి ఆమె గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ పొందారు. అనంతరం ఫ్లయింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.

ఎవరీ ప్రియా శర్మ ?

రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాకు చెందిన ప్రియ శర్మ, తన తండ్రి అడుగుజాడల్లోనే వైమానిక దళంలో చేరారు. ఇంజనీర్ అయిన ఆమె తన బ్యాచ్‌లోని ఏకైక మహిళా ఫైటర్ పైలట్ . మొదట హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో పనిచేశారు. తర్వాత కర్ణాటకలోని బీదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు స్టేజ్ 2 , స్టేజ్ 3 అడ్వాన్స్‌డ్ ఫైటర్ శిక్షణ కోసం వెళ్లారు. తన తండ్రి బీదర్‌లో ఉన్నప్పుడు ఆకాశంలో జాగ్వార్‌లు, హాక్ విమానాలను చూస్తూ గడిపిన బాల్యం నుండి తనకు విమాన ప్రయాణమంటే మక్కువ ఏర్పడిందని శర్మ చెప్పారు. ఈ సంవత్సరం ఆగస్టులో, బికనీర్‌లోని నల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో మిగ్-21 వీడ్కోలు విన్యాసాల సమయంలో ఆమె కీలకంగా ఉన్నారు.

MiG-21 Farewell Flypast Meet Squadron Leader Priya Sharma the IAF Pilot Making History

మిగ్ 21 వీడ్కోలు కార్యక్రమం

రేపు జరిగే మిగ్ 21 వీడ్కోలుకు ముఖ్య అతిథిగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతారు. ఎయిర్ ఫోర్స్ ఎలైట్ స్కైడైవింగ్ బృందం 'ఆకాశ్ గంగా' పేరుతో 8,000 అడుగుల నుండి కిందకు దూకుతూ అద్బుత ప్రదర్శన చేయనున్నారు. దీని తర్వాత మిగ్-21 విమానం యొక్క ఫ్లైపాస్ట్, ఎయిర్ వారియర్ డ్రిల్, వైమానిక వందనం నిర్వహిస్తారు. ఫైటర్ పైలట్లు మూడు-విమానాలు 'బాదల్' ఆకారంలో, నాలుగు-విమానాలు పాంధర్ ఆకారంలో ఎగరేస్తారు. చివరిసారిగా ఆకాశంపై ఉరుములు మెరుపులతో ఎగురుతారు. సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం కూడా ఉత్కంఠభరితమైన విన్యాసాలను ప్రదర్శిస్తుంది. చివరికి నేలపైకి వచ్చి ల్యాండ్ కావడంతో మిగ్ 21లు వీడ్కోలు తీసుకుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+