కుప్పకూలిన మిగ్ -21 భారత వైమానిక విమానం
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్ -21 విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలిపోయింది. రాజస్థాన్ లోని బార్మర్ ప్రాంతం సమీపంలో వైమానిక దళ విమానం కూలిపోయిందని భారత వైమానిక దళ అధికారులు తెలిపారు.
విమానంలో ఉన్న ఇద్దరు పైలెట్లు క్షేమంగా బయటపడ్డారని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. రాజస్థాన్ లోని బార్మర్ సమీపంలో ఉత్తర్ లాయ్ ఎయిర్ బేస్ ఉంది. ఎయిర్ బేస్ నుంచి మిగ్ -21 విమానం టేకాఫ్ తీసుకుంది.

టేకాఫ్ తీసుకున్న కొంత సేపటికే బార్మర్ సమీపంలోనే కుప్పకూలిపోయింది. టీ-69 ట్రైనర్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ను టేకాఫ్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం వలన ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.
ప్రమాదం ఎలా జరిగింది అని విచారణ చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాత వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. విమానం కుప్పకూలిన విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications