లాక్ డౌన్..?: ఖాళీ అవుతోన్న ఢిల్లీ, ముంబై.. కళ్లముందే కదలాడుతున్న గతేడాది జ్ఞాపకాలు
కరోనా ఉగ్ర రూపం దాల్చుతోంది. కేసులు పెరగడంతో ఢిల్లీ, ముంబైలో మళ్లీ ముసలం మొదలైంది. అక్కడి నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు కూలీలు యోచిస్తున్నారు. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లాలని అనుకుంటున్నారు. ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ విధించడంతో వారు బిక్కుబిక్కు మంటున్నారు. ఉన్న చోట ఉపాధి లేదని.. ఇక సొంత గ్రామాలకు వెళ్లేందుకు రెడీ అయిపోయారు.

బారులుతీరిన కూలీలు
ఢిల్లీలో గల ఆనంద్ వీహర్ బస్ స్టేషన్ వద్ద చాలా మంది కూలీలు బారులు తీరారు. మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే భయంతో ఇంటికి వెళుతున్నారు. ఇదివరకు ఎదుర్కొన్న ఇబ్బందులను ఫేస్ చేయొద్దని అనుకుంటున్నారు. గతంలో డబ్బులు లేక, ఆహారం లేక పాట్లు పడ్డారు. ఇలాంటి పరిస్థితిని ముంబైలో ఉంటున్న కూలీలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఉన్న పని లేదని.. అప్పుడు నగదు దొరకదని వాపోతున్నారు.

ఎంపీ, పంజాబ్ కూడా
ఇలాంటి పరిస్థితే మధ్యప్రదేశ్, పంజాబ్ ఇతర చోట్ల కూడా ఎదురవుతోంది. ఆయా చోట్ల లాక్ డౌన్ కన్నా ముందటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. గతేడాది అనుభవించిన పరిస్థితులు ఎదురు కావొద్దు అని అనుకుంటున్నారు. ఇప్పుడు వెళ్లకుంటే తాము ఇక్కడే చిక్కుకుంటామని బీహర్‌కి చెందిన ఒక కూలీ మీడియాతో చెప్పారు. ఢిల్లీలో ఈ నెల 30వ తేదీ వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉన్న సంగతి తెలిసిందే.

50 శాతం మంది
హొటళ్లు, బార్, రెస్టారెంట్లు కూడా క్లోజ్ చేసే పరిస్థితి వస్తోంది. దీంతో 50 శాతం మంది కూలీలు స్వస్థలాలకు వెళుతున్నారని పుణె హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గణేశ్ శెట్టి తెలిపారు. మహారాష్ట్రలో కూడా రాత్రి పూట కర్ఫ్యూ.. వీకెండ్ లాక్ డౌన్ అమలవుతోన్న సంగతి తెలిసిందే. గతేడాది వేలాది మంది కాలినడకన స్వస్థలాలకు చేరేందుకు అపసోపాలు పడ్డారు. వెళ్లే దారిలో చాలా మంది వరకు చనిపోయారు.












Click it and Unblock the Notifications