సీఆర్పీఎఫ్ బంకర్‌పై గ్రనేడ్ విసిరిన ఉగ్రవాదులు.. 12 మందికి గాయాలు...
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఎప్పుడూ రద్దీగా ఉండే పుల్వామాలో గల ఓ రహదారిపై సీఆర్పీఎఫ్ జవాన్ల బంకర్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. గ్రనేడ్ విసిరారు.. అయితే అదీ లక్ష్యాన్ని చేరుకోలేదు. పక్కనే పడటంతో.. స్థానికులు గాయపడ్డారు. గ్రనేడ్ విసరడంతో 12 మంది పౌరులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం 5.45 గంటలకు ఘటన జరిగిందని వివరించారు. గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు.
పుల్వామాలో గల చౌక్ కాకపోర ఏరియా వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లు 41 బెటాలియన్ ఉంది. వారి లక్ష్యంగా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. బంకర్‌పై గ్రనేడ్ విసరగా.. అదీ తప్పిపోయింది. రద్దీగా ఉండే రహదారి పడి పేలిపోయింది. దీంతో పౌరులు గాయపడ్డారు. ఘటనపై పుల్వామా పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని.. ఉగ్రవాద కోణంపై దర్యాప్తు జరుపుతామని తెలిపారు.

గ్రనేడ్ విసిరిన తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. మిలిటెంట్ల కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. కడపటి వార్తలు అందేవరకు మిలిటెంట్లు ఆచూకీ తెలియలేదు అని పోలీసు వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications