వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభిజిత్‌కు రాహుల్ ప్రశంసలు: మిమ్మల్ని చూసి కోట్లాదిమంది గర్వపడుతున్నారు..

|
Google Oneindia TeluguNews

ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన అభిజిత్ బెనర్జీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. దేశంలోని కోట్లాదిమందికి ఆదర్శంగా నిలిచారని ట్వీట్ చేశారు. అభిజిత్ బెనర్జీని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వృత్తిపరంగా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాహుల్ మద్దతుగా నిలిచారు.

ప్రౌడ్ ఆఫ్ యూ..
'దేశంలోని మిలియన్ల మంది ప్రజలు మిమ్మల్ని చూసి గర్వపడుతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రూపొందించిన కనీస ఆదాయ పథకం (న్యాయ్) ప్రవేశపెట్టింది అభిజిత్ బెనర్జీని అని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. ఈ పథకంతో ప్రజల కనీస ఆదాయం పెరుగుతుందని లెక్కగట్టారు. కానీ అభిజిత్‌ను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న విమర్శలను మాత్రం తప్పు అని' రాహుల్ గాంధీ తప్పుపట్టారు. దేశంలో ఉన్న కొందరు మేధావులు, పెద్దలు మీ నిర్ణయాలను, అభిప్రాయలను వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. వారు గుడ్డిగా అపోజ్ చేయడం మంచిది కాదన్నారు. వారు ఏమీ చేయరని, మేధావులును ప్రశ్నించడం సరికాదన్నారు.

Millions Of Indians Proud Of Your Work: Rahul on Abhijit

పీయూష్ ఏమన్నారంటే..
నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్‌పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విమర్శలు చేశారు. ఆయన వామపక్షవాది అని మండిపడ్డారు. కాంగ్రెస్ పథకం కనీస ఆదాయ పథకానికి అభిజిత్ సమర్థించడం సరికాదన్నారు. దీంతో భారత ప్రజల భావజాలన్ని అభిజిత్ తిరస్కరించారని అర్థమవుతుందన్నారు. దీంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అభిజిత్ బెనర్జీ కామెంట్ చేయడంతో ప్రభుత్వం రియాక్షన్ ఇవ్వాల్సి వచ్చింది.

English summary
Congress leader Rahul Gandhi tweeted in support of Abhijit Banerjee today after the Nobel Prize-winning economist objected to Union Minister Piyush Goyal questioning his professionalism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X