మజ్లిస్ మహా సంచలనం: రెండింట గెలుపు (పిక్చర్స్)
ముంబై/హైదరాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఖాతా తెరిచింది. బైకుల్లా నియోజకవర్గం నుండి ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వారిస్ పఠాన్ 850 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మజ్లిస్ పార్టీ తొలిసారి ప్రాతినిథ్యం వహించనుంది. మహా ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ మొత్తం రెండు స్థానాల్లో గెలుపొంది సంచలనం సృష్టించింది.
ముంబైలోని బైకుల్లా నియోజకవర్గం నుండి వారిస్ యూసఫ్ పఠాన్, ఔరంగాబాద్ సెంట్రల్ నుండి ఇంతియాజ్ జలిక్గె గెలుపొందారు. వారిస్ పఠాన్‌కు 25,314 ఓట్లు వచ్చాయి. అతను తన సమీప ప్రత్యర్థి బీజేపీ ముఖ్య నేత మధుకర్ జీ చవాన్‌ను ఓడించాడు. ఇంతియాజ్ తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి ప్రదీప్ జైశ్వాల్‌ను దాదాపు 20వేల ఓట్ల తేడాతో ఓడించాడు. మరో రెండు మూడు స్థానాల్లో మజ్లిస్ రెండో స్థానంలో ఉంది.
మొన్నటి, వరకు హైదరాబాదుకే పరిమితమైన మజ్లిస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రల పైన గురి పెట్టిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నాటక తదితర రాష్ట్రాలలో కొన్ని స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ఏకంగా మహారాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించనుంది.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మధ్యాహ్నం వరకు మజ్లిస్ పార్టీ ఒక స్థానంలో గెలుపొంది, మూడు స్థానాలలో ముందంజలో ఉంది. ఇటీవల మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ, మజ్లిస్ పార్టీ తెలంగాణ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీలు మహారాష్ట్రలో జోరుగా ప్రచారం నిర్వహించారు.
వారి సభలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. మహారాష్ట్రలో మజ్లిస్ పార్టీ ముప్పైకి పైగా స్థానాలలో పోటీ చేసింది. తమకు బలం ఉంటుందని భావించిన చోట ఆ పార్టీ పోటీ చేసింది. మహారాష్ట్రలో ఒక స్థానం గెలుపొందడంతో మజ్లిస్ పార్టీ ఆనందంలో తేలియాడుతోంది.

మజ్లిస్
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. మొన్నటి వరకు హైదరాబాదుకే పరిమితమైన మజ్లిస్ మహారాష్ట్ర ఎన్నికల్లో సత్తా చాటింది. బైకల్లా నుండి గెలుపొందిన వారిస్ పఠాన్ విజయ ధరహాసం.

మజ్లిస్
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. మొన్నటి వరకు హైదరాబాదుకే పరిమితమైన మజ్లిస్ మహారాష్ట్ర ఎన్నికల్లో సత్తా చాటింది. బైకల్లా నుండి గెలుపొందిన వారిస్ పఠాన్ అభివాదం చేస్తూ..

మజ్లిస్
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. మొన్నటి వరకు హైదరాబాదుకే పరిమితమైన మజ్లిస్ మహారాష్ట్ర ఎన్నికల్లో సత్తా చాటింది.

మజ్లిస్
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. మొన్నటి వరకు హైదరాబాదుకే పరిమితమైన మజ్లిస్ మహారాష్ట్ర ఎన్నికల్లో సత్తా చాటింది.

మజ్లిస్
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. మొన్నటి వరకు హైదరాబాదుకే పరిమితమైన మజ్లిస్ మహారాష్ట్ర ఎన్నికల్లో సత్తా చాటింది. వారిస్ పఠాన్ అభిమానులు ర్యాలీ తీస్తున్న దృశ్యం.
మరోవైపు, మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ గెలుపొందినందుకు హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. నాయకులు, నేతలు మిఠాయి పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో బీజేపీ 122 స్థానాల్లో గెలుపొందింది. శివసేన 63, కాంగ్రెస్ 42, ఎన్సీపి 41 స్థానాల్లో గెలుపొందింది.












Click it and Unblock the Notifications