బీజేపీకి ఊహించిన షాక్ ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డి, సిద్దరామయ్య పక్కన ప్రత్యక్షం !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. శనివారం మద్యాహ్నం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో లక్ష మందికి పైగా అభిమానుల సమక్షంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. డీకే శివకుమార్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రి కావడంతో సిద్దరామయ్య మీద, ప్రభుత్వం మీద పట్టు సాధించడానికి అవకాశం చిక్కింది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సిద్దరామయ్య, డీకే శివకుమార్ ను అభినందించడానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు బెంగళూరు వచ్చారు.

ఇదే సమయంలో బీజేపీ నుంచి బయటకు వచ్చి కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ (కేఆర్ పీపీ)ని స్థాపించి గంగావతిలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సిద్దరామయ్య, డీకే శివకుమార్ ను అభినందించి శుభాకాంక్షలు చెప్పడానికి కంఠీరవ స్టేడియం చేరుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అప్పట్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించి ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కీలకపాత్ర పోషించిన గాలి జనార్దన్ రెడ్డి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏకుమేకై కుర్చున్నారు. కర్ణాటక అసెంబ్లీలో సిద్దరామయ్యను చూసి తొడకొట్టిన బళ్లారి శ్రీరాములు అల్లుడు, అప్పటికే బీజేపీ ఎమ్మెల్యే సురేష్ చేసిన పనికి సిద్దరామయ్య బెంగళూరు నుంచి బళ్లారికి పాదయాత్ర చేశారు.
బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి బ్యాచ్ ఆరోజు చేసిన చాలెంజ్ తో సిద్దరామయ్య బెంగళూరు టూ బళ్లారి పాదయాత్ర చెయ్యడంతోనే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి సిద్దరామయ్య సీఎం అయ్యారు. తరువాత జరిగిన పరిణాలతో గాలి జనార్దన్ రెడ్డి జైలుపాలైన తరువాత ఆయన్ను బీజేపీ నాయకులు పట్టించుకోవడం మానేశారు.

బీజేపీ తీరుతో విసిగిపోయిన గాలి జనార్దర్ రెడ్డి బీజేపీ నుంచి బయటకు వచ్చి కేఆర్ పీ పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి నియోజక వర్గంలో పోటీ చేసి కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలకు చుక్కలు చూపించి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సిద్దరామయ్య సీఎం అయితే తాను కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తానని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజే గాలి జనార్దన్ రెడ్డి బహిరంగంగా మీడియా ముందు చెప్పారు.
అనుకున్నట్లు సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేసిన రోజు కంఠీరవ స్టేడియంలో ప్రత్యక్షం అయిన గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నాయకులుకు షాక్ ఇచ్చి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డీకే శివకుమార్ కు శుభాకాంక్షలు చెప్పి వారిని అభినందించారు. మొత్తం మీద తన నియోజక వర్గంలో పనులు జరగాలన్నా, బీజేపీ నాయకులకు ఝలక్ ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం అని గ్రహించిన గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో రాజీ అవుతున్నారని తెలిసింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications