వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్‌ వైపే: మే 3 తరువాత పరిస్థితేంటీ? కేంద్రం ఏం చెబుతుంది? కాస్సేపట్లో భేటీ..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా ప్రస్తుతం రెండోదశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే 3వ తేదీ వరకు కొనసాగబోతోందీ లాక్‌డౌన్. ఆ తరువాత పరిస్థితి ఏంటీ? లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా? 3వ తేదీతోనే ఆపేస్తారా? కేంద్రం వైఖరేంటీ? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు? ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న చర్చలు ఇవి. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను జూన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.

మళ్లీ తబ్లిగీ జమాతీల అలజడి: మసీదులో నక్కి: యూనివర్శిటీ ప్రొఫెసర్ సహా 30 మందికి బేడీలుమళ్లీ తబ్లిగీ జమాతీల అలజడి: మసీదులో నక్కి: యూనివర్శిటీ ప్రొఫెసర్ సహా 30 మందికి బేడీలు

 లాక్‌డౌన్ వల్ల తలెత్తిన ఇబ్బందులపై

లాక్‌డౌన్ వల్ల తలెత్తిన ఇబ్బందులపై

ఇలాంటి పరిస్థితుల మధ్య కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం మరి కాస్సేపట్లో భేటీ కాబోతోంది. నరేంద్ర మోడీ 19 రోజుల రెండోదశ లాక్‌డౌన్‌ను ప్రకటించిన తరువాత ఉపసంఘం భేటీ కావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. లాక్‌డౌన్ పొడిగించాల్సి వచ్చినందున దేశ ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారనే అభిప్రాయం కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో నెలకొంది. తొలి దశలో 21 రోజులు.. మలిదశలో 19 రోజుల పాటు దేశ ప్రజలు స్వీయ నిర్బంధంలో గడపాల్సి రావడం వల్ల ఆర్థిక ప్రగతి కూడా స్తంభించిందని, ఇది మరిం తీవ్రరూపం దాల్చక ముందే.. కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితిని కేంద్రం ఎదుర్కొంటోంది.

 లాక్‌డౌన్ ముగించడం వైపే మొగ్గు..

లాక్‌డౌన్ ముగించడం వైపే మొగ్గు..

వచ్చేనెల 3వ తేదీన లాక్‌డౌన్‌ను ముగించడానికే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోందని అంటున్నారు. మంగళవారం సాయంత్రం మంత్రివర్గ ఉపసంఘం ఈ దేశ రాజధానిలో సమావేశం కాబోతోంది. లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్‌ ఎలా ఉండలనే విషయంపై వారు చర్చిస్తారని అంటున్నారు. లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్‌ను అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాల అంశం వారి మధ్య ప్రధానంగా చర్చకు రావచ్చని చెబుతున్నారు. 19 రోజుల లాక్‌డౌప్ సడలింపు సందర్భంగా ఎదురైన సవాళ్లు, తలెత్తిన సమస్యలపై ఇప్పటికే వారంతా రాష్ట్రాల నుంచి నివేదికలను తెప్పించుకున్నారని సమాచారం.

రాష్ట్రాల నుంచి అందిన నివేదికల ఆధారంగా..

రాష్ట్రాల నుంచి అందిన నివేదికల ఆధారంగా..

అన్ని రాష్ట్రాల నుంచి అందిన నివేదికల ఆధారంగా కేంద్రమంత్రుల బృందం తన మార్గదర్శకాలను రూపొందించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన సూచనలు, సలహాలను ఆధారంగా వాటిని రూపొందించాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ను ఎత్తేయాల్సి వస్తే.. అది ఏ రూపంలో ఉండాలి? ఎన్ని దశల్లో ఉండాలి? ఏఏ రంగాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందనే అంశాలపై మంత్రుల బృందం చర్చించబోతోంది. ఈ బృందానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నాయకత్వాన్ని వహిస్తున్నారు.

Recommended Video

Yogi Adityanath Not Going To Participate In His Father Last Rites
 రాష్ట్రాలకు స్వేచ్ఛ..

రాష్ట్రాలకు స్వేచ్ఛ..

మే 3వ తేదీన ముగియబోతోన్న 19 రోజుల రెండోదశ లాక్‌డౌన్ గడువు ముగిసిన తరువాత కేంద్రం దాన్ని బ్రేక్ వేయాల్సి వస్తే.. రాష్ట్రాలు ఏం చేయాల్సి ఉంటుందనే అంశం చర్చకు రావచ్చని చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తన పరిధి మేరకు లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వరకు పొడిగించుకుంది. ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్.. సడలింపు కోరుకోవట్లేదు. తమకు సడలింపు అక్కర్లేదని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మే 3వ తేదీ తరువాత లాక్‌డౌన్‌ను ఎత్తేసినప్పటికీ.. కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు దాన్ని పొడిగించుకునే వెసలుబాటును కల్పిస్తుందని అంటున్నారు.

English summary
After May 3, there may be conditional relief from the nationwide lockdown, but in the parts of India least affected by coronavirus, sources said on Tuesday ahead of an assessment by a group of ministers this evening. The group headed by Defence Minister Rajnath Singh is likely to discuss an exit plan after the lockdown was extended to May 3 by Prime Minister Narendra Modi last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X