కిరాతకం: మైనర్ బాలికపై వారం రోజుల పాటు గ్యాంగ్ రేప్

Posted By:
Subscribe to Oneindia Telugu

రాజ్ కోట్: 14 ఏళ్ళ మైనర్ బాలికపై వారం రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

పశ్చిమ బెంగాల్ లోని బొంగా గ్రామానికి చెందిన సాయి అనే ఏజంట్ కు మైనర్ బాలికను అమ్మేశారు. అక్కడి నుండి ఆ అమ్మాయని గుజరాత్ లోని జునాఘడ్ జిల్లాకు పంపారు.

gang rape

అహ్మదాబాద్ కు అక్కడి నుండి మంగ్రోల్ కు చేరుకొంది ఆ బాలిక. అహ్మదాబాద్ లో ఏడుగురు దుండగులు వారం రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు.

మంగ్రోల్ లో 14 మంది ఆ బాలికకు నరకం చూపారు. మంగ్రోల్ బస్ స్టేషన్ వద్ద బాధితురాలు ఏడుస్తుండడాన్ని స్థానికులు గుర్తించారు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే బాష సమస్య తలెత్తింది.

అయితే అమ్మాయిని స్థానికులు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు. పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడైంది.ఎక్కడెక్కడ తనను లైంగికంగా దాడులకు గురైందో ఆ బాలిక వివరించింది.బాలికను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 14-year-old minor girl from Bangladesh was allegedly gang-raped in Ahmedabad and Mangrol town of Junagadh.Mangrol police has launched probe on basis of the minor girl's complaint on Saturday
Please Wait while comments are loading...