22 ఏళ్ల యువతి ప్రేమలో 17 ఏళ్ల బాలుడు, పెళ్లి: ఒప్పందం

సేలం: వయసులో తన కంటే ఎనిమిదేళ్లు పెద్దదైన ఓ యువతిని అబ్బాయి ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే, వీరి పెళ్లి పైన పెద్దలు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆ ప్రేమికులు పోలీసులను ఆశ్రయించారు. ఆ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో జరిగింది.

సేలం జిల్లాలో 17 ఏళ్ల అబ్బాయి ఓ కాటన్ మిల్లులో పని చేస్తున్న 22 ఏళ్ల అమ్మాయిని ప్రేమించాడు. ఆమె ప్రేమను ఆమె కూడా అంగీకరించింది. దీంతో వారు ఆదివారం నాడు గుడిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వారు వధువు ఇంటికి సోమవారం వెళ్లారు.

Minor boy marries 22 year old woman

కానీ వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆ ప్రేమ జంట ఆశ్రయించింది. అయితే, అబ్బాయి మైనర్ అని గుర్తించిన పోలీసులు మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చారు.

అబ్బాయికి పెళ్ళి వయసు వచ్చిన తర్వాత వీరిద్దరికీ వివాహం జరిపిస్తామని ఇరు కుటుంబ పెద్దలతో పోలీసులు లేఖలు రాయించుకుని, నూతన వధూవరులను ఎవరింటికి వాళ్ళను పంపారు.

అంతకుముందు తమ అబ్బాయి కనిపించక పోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు వెతికారు. వారు ఒమలురూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం తమ తనయుడు యువతి ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని, వెంటనే ఆమె ఇంటికి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+