అరటి తోటలో కీచకపర్వం.. బాలికను అపహరించి, గ్యాంగ్ రేప్!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నలటవాడ్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికను అపహరించిన నలుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక స్కూలుకు వెళుతుండగా అడ్డగించిన కీచకులు ఆ బాలికను సమీపంలోని అరటితోటలోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఆ బాలిక అరుపులు విన్న ఆమె తండ్రి అక్కడికి పరిగెత్తుకురాగా.. నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే అతడు ప్రాణాలకు తెగించి నిందితుల్లో ఒక యువకుడిని పట్టుకోగా మిగిలిన ముగ్గురు మాత్రం పారిపోయారు.

Minor Girl Gangraped in Banana Field on Way to School in Karnataka

బాధిత బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే ఈ దారుణం జరిగి 24 గంటలవుతున్నా.. పరారీలో ఉన్న ఆ ముగ్గురు నిందితులను పోలీసులు ఇప్పటికీ పట్టుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులను దిగ్బంధం చేసి తీవ్ర నిరసన చేపట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A minor girl was gangraped by 4 men in a banana field while she was on her way to school. The girl's father managed to catch hold of one of the accused. Hundreds of villagers blocked the road protesting the delay in catching the remaining 3 culprits. This incident was happened in Nalatawad Village of Bijapur District, Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి