హోటల్లో రేప్, హత్య: యూకేలో బాలికపై ఒక్కరోజులోనే నాలుగుసార్లు రేప్
పూణే: మహారాష్ట్రలో ఏడేళ్ల బాలిక పైన అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన సంఘటన జరిగింది. ఈ సంఘటన రెండు రోజుల క్రితం లోనావాలా ప్రాంతంలోని ఓ హోటల్లో జరిగిందని గురువారం నాడు పోలీసులు వెల్లడించారు. ఆ ఏడేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి హోటల్లో జరిగిన ఓ పెళ్లికి ఆదివారం హాజరైంది.
అక్కడి నుండి ఆమె కనిపించడం లేదు. అనంతరం మంగళవారం నాడు హోటల్ టెర్రాస్ పైన ఆమె గొంతు కోసి కనిపించింది. బాలిక పైన లైంగిక దాడి జరిగి ఉంటుందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు మనోజ్ కుమార్ లోహియా చెప్పారు.
పోస్టుమార్టం నివేదిక ఇవాళ వస్తుందని చెప్పారు. ఈ కేసును అన్ని కోణాల్లోను విచారిస్తున్నామని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని చెప్పారు. అలాగే హోటల్ సిబ్బందిని విచారిస్తున్నామని తెలిపారు. అలాగే ఆ రోజు పెళ్లి వేడుకకు వచ్చిన వారిని కూడా ప్రశ్నిస్తున్నామన్నారు.

టెర్రాస్ పైన ఉన్న సీసీటీవీ కెమెరా పని చేయడం లేదని గుర్తించామన్నారు. తాము పెళ్లికి వచ్చిన వారివి, హోటల్ స్టాఫ్, వంటవారివి, యాజమాన్యంవి.. ఇలా అందరి స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నామని చెప్పారు.
రోజులో నాలుగుసార్లు ఎనిమిదేళ్ల బాలికపై రేప్
యూకేలో దారుణం జరిగింది. ఓ ఎనిమిదేళ్ల బాలిక పైన ఓ వ్యక్తి ఒకే రోజులో నాలుగుసార్లు అత్యాచారం చేశాడు. అతనికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన ఏళ్ల క్రితం జరిగింది. బాధిత బాలిక న్యాయమూర్తికి పూర్తి వివరాలు తెలియజేసింది. ఒకేరోజులో కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి నాలుగుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, దీనిని నిందితుడు కొట్టి పారేస్తున్నాడు. అతనికి న్యాయమూర్తి పదేళ్ల జైలు శిక్ష విధించాడు.












Click it and Unblock the Notifications