దారుణం: 6ఏళ్ళ బాలికపై రేప్, నిందితుడిని చంపిన గ్రామస్థులు
ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని గ్రామస్తులే కొట్టి చంపారు.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆలీఘడ్ లో ఈ ఘటన చోటుచేసుకొంది.
ఆలీఘఢ్: ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని గ్రామస్తులే కొట్టి చంపారు.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆలీఘడ్ లో ఈ ఘటన చోటుచేసుకొంది.
ఆలీఘడ్ లోని బన్నాదేవి ప్రాంతానికి చెందని ఆరేళ్ళ చిన్నారిని బీహర్ లోని బదౌన్ కు చెందిన అరవింద్ అకా కిడ్నాప్ చేశారు. బాలిక ఇంటి సమీపంలోనే అరవింద్ పనిచేసేవాడు.

మంగళవారం సాయంత్రం నుండి బాలిక కన్పించకుండా పోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు తెలిసనివారిని విచారించారు.బాలికను అరవింద్ తీసుకెళ్తుండగా తాము చూశామని కొందరు చెప్పారు. పోలీసులకు సమాచారం కూడ ఇచ్చారు కుటుంబసభ్యులు.
అయితే సమయానికి పోలీసులు రాలేదు. గ్రామస్థులే జట్టుగా ఏర్పడి గాలించి అరవింద్ ను పట్టుకొన్నారు. చిన్నారి బికామ్ పుర సమీపంలోని నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారం చేసినట్టు గ్రామస్థులకు అరవింద్ తెలిపారు.
తన పేరు ఎక్కడ బయటపడుతోందోననే భయపడి చిన్నారి గొంతునులిమి హత్య చేసినట్టు గ్రామస్థులకు చెప్పారు. అనంతరం అరవింద్ చెప్పిన స్థలంలో చిన్నారి మృతదేహన్ని కనుగొన్నారు. అక్కడ చిన్నారి మృతదేహన్ని చూసిన గ్రామస్థుల కోపం కట్టలు తెంచుకోవడంతో అరవింద్ పై మూకుమ్మడిగా దాడి చేశారు.
అదే సమయానికి పోలీసులు వచ్చి తీవ్ర గాయాలైన నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అరవింద్ మృతిచెందాడు. పోలీసులు విచారణ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications