వరుసగా చెల్లెపై అత్యాచారం: గర్భం దాల్చిన బాలిక
గుర్గావ్: ఓ పదహేడేళ్ల బాలుడు వరుసగా తన చెల్లెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్బం దాల్చింది. ఓ 12 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్టై ఆ ఆ బాలుడు ఇటీవలే జువెనైల్ హోం నుంచి విడుదలయ్యాడు. చెల్లెపై అతను వరుసగా అత్యాచారానికి పాల్పడ్డాడని, దీంతో ఆమె గర్భం దాల్చిందని పోలీసులు చెప్పారు.
సోనిపేటకు చెందిన ఆ కుటుంబం భోండ్సీలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం. నిందితుడి వారిలో మూడో వాడు కాగా, బాధితురాలు నాలుగో సంతానం. ఇద్దరు కూడా పాఠశాలకు వెళ్లడం మానేశారు. నెల క్రితం మొదటిసారి తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు కౌన్సెలింగ్‌లో చెప్పింది.

ఆ తర్వాత మరో రెండు సార్లు కూడా రేప్ చేసినట్లు ఆమె తెలిపింది. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, చెప్తే పరువు పోతుందని నిందితుడు చెల్లెను బెదిరించాడు. దీంతో ఆమె విషయాన్ని దాచి పెట్టింది.
కుటుంబ సభ్యులంతా పడుకున్న సమయంలో వేరే గదిలో బాలికపై అత్యాచారం జరిగింది. ఏం జరుగుతుందనే విషయం కూడా బాలికకు తెలియదు. అటువంటి స్థితిలో లైంగిక దోపిడీకి ఆ బాలిక గురైంది. పీరియడ్స్ రాకపోవడంతో ఆనుమానం వచ్చింది. దీంతో తల్లికి విషయం తెలిసింది.












Click it and Unblock the Notifications