'రెండేళ్ళ పాటు మహిళపై మంత్రి అత్యాచారం, ఆ మంత్రి జైలుకెళ్తే చూడాలని ఉంది'

ఉత్తర్ ప్రదేశ్ లో ఓ మహిళపై ఆమె కూతురిపై మంత్రి గాయత్రి ప్రజాపతి ఆయన అనుచరులు అత్యాచారం చేశారనే ఆరోపణలపై సుప్రీం కోర్టు ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు.

న్యూఢిల్లీ:ఉత్తర్ ప్రదేశ్ లో ఓ మహిళపై ఆమె కూతురిపై మంత్రి గాయత్రి ప్రజాపతి ఆయన అనుచరులు అత్యాచారం చేశారనే ఆరోపణలు రాజకీయంగా సంచలనం కల్గిస్తున్నాయి. ఎన్నికల తరుణంలో ఈ ఆరోపణలు సమాజ్ వాదీ పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గాయత్రి ప్రజాప్రతిని, ఆయన అనుచరులను జైల్లో వేస్తే చూడాలని ఉందని బాధితురాలు చెబుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళను, ఆమె కూతురును మంత్రి గాయత్రి ప్రజాపతి , ఆయన అనుచరులు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.అయితే ఈ విషయమై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు తొలుత కేసు నమోదు చేయలేదు.

అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం నాడు మంత్రి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.

మంత్రి ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయం నుండి ఆయన కన్పించకుండా వెళ్ళిపోయారు. ఆయన అదృశ్యమయ్యారు. త్వరలోనే మంత్రిని అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు.అయితే ములాయం సింగ్ కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న ప్రజాపతిని అఖిలేష్ మంత్రివర్గంలోకి తీసుకొన్నారు.

గాయత్రి ప్రజాపతి , ఆయన అనుచరులు జైలుకెళ్తే చూడాలని ఉంది

గాయత్రి ప్రజాపతి , ఆయన అనుచరులు జైలుకెళ్తే చూడాలని ఉంది

ఉత్తర్ ప్రదేశ్ లో ఓ మహిళను ఆమె మైనర్ కూతురును మంత్రి గాయత్రి ప్రజాపతి అత్యాచారం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. ఇదే సమయంలో పదవ తరగతి చదివే మైనర్ కూతురుపై కూడ లైంగిక దాడికి పాల్పడ్డారు.దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ప్రస్తుతం ఆ బాలిక ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతోంది.మంత్రి గాయత్రి ప్రజాపతి తో పాటు ఆయన అనుచరులు కూడ అరెస్టై జైలుకు వెళ్తే చూడాలని ఉందని బాధితురాలు కోరుకొంటుంది.

వాంగ్మూలాలు సేకరిస్తున్న పోలీసులు

వాంగ్మూలాలు సేకరిస్తున్న పోలీసులు

మంత్రి అత్యాచారం చేశారని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కనీసం స్పందించలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.అయితే బాధితురాలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదుచేశారు.అదే సమయంలో అందరి వాంగ్మూలాలు సేకరించారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మైనర్ బాలిక వాంగ్మూలం సేకరించనున్నట్టు అడిషనల్ డిజిపి దల్జీత్ చౌదరి చెప్పారు.

ఇంకా భయం వీడని బాలిక

ఇంకా భయం వీడని బాలిక

ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఇంకా భయం వీడలేదు. రాత్రి పూట నిద్రలో కలవరిస్తోంది. అంతేకాదు తనను తాను రక్షించుకొనేందుకుగా వెళ్తున్నట్టుగా ఆసుపత్రి నుండి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. లైంగికదాడికి గురికావడంతో తీవ్రంగా అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్ళిందని బాదిత కుటుంబం చెబుతోంది.

పార్టీలో మంచి పదవి ఇస్తానని లైంగికదాడి

పార్టీలో మంచి పదవి ఇస్తానని లైంగికదాడి

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ మహిళకు పార్టీలో మంచి పదవి ఇప్పిస్తానని చెప్పి మంత్రి గాయత్రి ప్రజాపతి ఓ మహిళపై రెండేళ్ళపాటు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.2016 లో ఓ రోజు ఆమె కూతురిపై కూడ లైంగిక దాడికి పాల్పడ్డారు.అయితే ఆ బాలిక తీవ్రంగా భయపడి అస్వస్థతకు గురైంది.దీంతో బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.తమ కుటుంబాన్ని నాశనం చేశారు. వారిని వదిలిపెట్టకూడదని బాదితురాలు కోరుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+