విమానం కుప్పకూలి అందరూ అగ్నికి ఆహుతి.. 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ చెక్కు చెదరని భగవద్గీత.. వీడియో వైరల్

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా 12 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ ఘటన యావత్ భారత్ నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజీ వైద్య కళాశాల భవనంపై పడటంతో మరో 24 మంది వైద్య విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఎయిరిండియా విమానం 625 అడుగుల ఎత్తులోంచి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 265 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. మృతుల శరీర భాగాలు మొత్తం ముద్దగా మారాయి. గుర్తుపట్ట లేనంతగా మృత దేహాలు కాలిపోయాయి. ఎవరు ఏంటి అని గుర్తు పట్టడం కష్టంగా మారింది. అయితే ఈ మంటల్లో భగవద్గీత పుస్తకం చెక్కు చెదరకుండా ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజెన్లు ఇదో అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Miracle Amid Tragedy Bhagavad Gita Found Unscathed in Air India Crash Wreckage

మరోవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాద సమయంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం విమానంలో ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అది మండే సమయంలో సహాయక చర్యలు చేపట్టడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. మరోవైపు దాదాపు 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు ఎగిసిపడ్డాయని ఓ అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో వ్యాపించిన మంటల కారణంగా పక్షులు, కుక్కలు కూడా అగ్నికి ఆహుతి అయినట్లు పేర్కొన్నారు.

ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటనలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బోయింగ్ 787-8 విమానాలను నిలిపివేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కీలక వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరోవైపు విమాన ప్రమాద స్థలాన్ని ఎన్ఐఏ బృందం పరిశీలించింది. విమాన ప్రమాద కారణాలపై ఆరా తీస్తోంది ఎన్ఐఏ బృందం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+