ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. ఇక్కడే బిగ్ ట్విస్ట్..
ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. ఒకేసారి నలుగురు పిల్లలు తమ కుటుంబంలోకి రావటంతో ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే పిల్లల బరువు ఒక్కొక్కరిది 1200గ్రాముల నుంచి 1600 గ్రాములుగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తక్కువ బరువు కారణంగా ప్రస్తుతం నలుగురు పిల్లలను ఆస్పత్రిలోని ఇంక్యూబేటర్లలో ఉంచామని వైద్యులు తెలిపారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
మహారాష్ట్ర పుణెలోని సస్వద్ కు చెందిన ఓ 27 ఏళ్ల మహిళ సతరా ఆస్పత్రిలో పురిటినొప్పులతో చేరారు. మహిళ ఆరోగ్య తీవ్రత దృష్ట్యా సిజేరియన్ చేయాలని నిర్ణయించారు అక్కడి వైద్యులు. ఆమెకు ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. అయితే ఆమెకు ఒకేసారి నలుగురు పిల్లలు పుట్టారు. ఓ మగ, ముగ్గురు ఆడపిల్లలకు ఆ మహిళ జన్మనిచ్చింది. పుట్టిన పిల్లలు ఒక్కొక్కరిది 1200 గ్రాముల నుంచి 1600 గ్రాములుగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బిడ్డలను ఆస్పత్రిలోని ఇంక్యూబేటర్లలో ఉంచామని వైద్యులు తెలిపారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇలా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టడంతో వైద్యులు ఆశ్చర్య పోయారు. అయితే ఆ మహిళకు గతంలోనూ ట్విన్స్ పుట్టారు. మరో బాలుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆమెకు ఏడుగురు సంతానం. గతంలో ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన ఘటనలు జరిగినా.. సతారా జిల్లా ఆసుపత్రిలో మాత్రం ఇదే తొలిసారి అని వైద్యులు వివరించారు.












Click it and Unblock the Notifications