వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ సత్తా చాటుతున్న మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్ ... ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడుతున్న వైమానికదళం

|
Google Oneindia TeluguNews

పుల్వామా దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడంది.తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. 12 మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్‌తో దాడి చేసింది. భారత్ చేసిన ఈ భీకర ఎటాక్‌లో ఉగ్రవాద శిబిరాలన్నీ నేలమట్టం అయ్యాయి. సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వెయ్యికిలోల బాంబులతో దాడి చేసి మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్‌ తమ సత్తా చాటాయి.

మిరాజ్ 2000... ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన యుద్ధ విమానం. భారత వైమానిక దళానికి చెందిన ఈ విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు జరిపింది. టెర్రరిస్టుల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. దీంతో మిరాజ్ 2000 యుద్ధ విమానం గురించి చర్చ మొదలైంది. మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఇప్పుడే కాదు... కార్గిల్ యుద్ధంలోనూ భారతదేశానికి కీలకంగా ఉపయోగపడ్డాయి. డసాల్ట్ కంపెనీ తయారు చేసిన మిరాజ్ విమానాలు శతృ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంలో కీలకం. ఇప్పట్లాగే కార్గిల్ యుద్ధం సమయంలో కూడా మిరాజ్ విమానాలు శతృ స్థావరాలను ధ్వంసం చేసి గర్వంగా తిరిగొచ్చాయి. అప్పుడు కార్గిల్ యుద్ధంలో భారతదేశం పైచేయి సాధించడానికి కారణం మిరాజ్ 2000 విమానాలే.

Recommended Video

దెబ్బకు దెబ్బ .. పాక్ పై భారత్ మెరుపు దాడి.. 300 మంది ఉగ్రవాదులు మృతి !
Mirage 2000 jet fighters shows the power of India.. Air Force attacks on terror camps

దసాల్ట్ మిరేజ్ 2000 ...ఒక ఫ్రెంచ్ మల్టీలెవల్, డస్సాల్ట్ ఏవియేషన్ చేత తయారు చేయబడిన సింగిల్-ఇంజన్ నాలుగో- జనరేషన్ జెట్ యుద్ధ విమానం. 1970వ దశకం చివరిలో ఫ్రెంచ్ వైమానిక దళం (ఆర్మీ డి ఎల్' ఎయిర్) కోసం మిరేజ్ III స్థానంలో తేలికైన యుద్ధ విమానం గా రూపొందించబడింది మిరేజ్ 2000. 600 పైగా విమానాలను తయారు చేసి 9 దేశాలకు యుద్ధ విమానాలను అందిస్తుంది. ఎయిర్ టు ఎయిర్ అంటే ఆకాశం నుంచి ఆకాశంలోకి బాంబుల్ని వేయగల సత్తా మిరాజ్ 2000 యుద్ధవిమానానికి ఉంటుంది. మైకా మల్టీ టార్గెట్ ఎయిర్ టు ఎయిర్ ఇంటర్‌సెప్ట్, యుద్ధ క్షిపణులు, మ్యాజిక్ 2 యుద్ధ క్షిపణులను మోసుకెళ్లగలదు. కార్గిల్ వార్ లో కూడా ఈ యుద్ధ విమానాన్ని చాలా ఎక్కువగా వినియోగించారు. మిరేజ్ 2000 విమానాన్ని తయారుచేసిన దసాల్ట్ కంపెనీ ప్రస్తుత రాఫెల్ యుద్ధ విమానాల తయారీ వివాదంలో ఉంది .

మిరాజ్ 2000లో డిజిటల్ వెపన్ డెలివరీ నావిగేషన్ సిస్టమ్ (WDNS) ఉంటుంది. పగలు, రాత్రి లేజర్‌-గైడెడ్ వెపన్స్ ఫైర్ చేయొచ్చు. ఒక్క నిమిషంలో 1,200 నుంచి 1,800 రౌండ్లు ఫిరంగుల్ని పేల్చగలదు. మిరాజ్ 2000 గరిష్టంగా గంటకు 2,530 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. మిరాజ్‌ 2000 యుద్ధ విమానాల్లో పలు రకాలున్నాయి. Mirage 2000C, Mirage 2000B, Mirage 2000N, Mirage 2000D, Mirage 2000-5F, Mirage 2000-5 Mark 2, Mirage 2000E, Mirage 2000M, Mirage 2000H, 2000I, Mirage 2000P, Mirage 2000-5EI, Mirage 2000-5EDA, Mirage 2000EAD/RAD, Mirage 2000EG, Mirage 2000BR, Mirage 2000-9... ఇవన్నీ మిరాజ్ యుద్ధ విమానాల్లో వేరియంట్లు. ప్రస్తుతం భారతదేశం దగ్గర 2000H మోడల్ 42, 2000TH మోడల్ 8 యుద్ధ విమానాలున్నాయి. 1999లో కార్గిల్ యుద్ధంలో మిరాజ్ 2000 యుద్ధ విమానం అందించిన సేవలు మర్చిపోలేనివి.

జైషే మహ్మద్ తీవ్రవాద శిబిరాలే టార్గెట్‌గా వైమానిక దళం దాడులు చేసింది .మొత్తం 12 యుద్ధ విమానాలతో దాడులకు దిగింది భారత్. కార్గిల్ యుద్ధం తర్వాత వైమానిక దళం దాడులు చేయడం ఇదే తొలిసారి. మోదీ ఆదేశాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పని పూర్తి చేసింది. మొత్తానికి కార్గిల్ వార్ లో సత్తా చూపించిన మిరేజ్ 2000 ఇప్పుడు జరుగుతున్న దాడుల్లో మరోమారు సత్తా చాటుకుంది. దేశ రక్షణా వ్యవస్థలో సేవలందిస్తున్న మిరాజ్ 2000 యుద్ధ విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది.

English summary
India attacks terrorist camps in retaliation for Pulwama attack.12 Mirage 2000 Jet Fighters Attacked on terrorist camps.Mirage 2000 jet fighters have been able to strike thousands of bombs on the terrorist camps along the border control line (LOC).The Mirage 2000, which has shown an extraordinary role in the Kargil War, has once again proved itself in the ongoing attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X