అర్థరాత్రి వేళ అమ్మాయిల హాస్టల్లోకి... ఎత్తుకెళ్లిందేమిటో తెలుసా?

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు : మహిళా కళాశాల హాస్టల్లో అర్థరాత్రి వేళ ఆగంతకులు ప్రవేశించి అమ్మాయిల లో దుస్తులైన బ్రాలు, అండర్ వేర్లు ఎత్తుకెళ్లిన బాగోతం బెంగళూరు నగరంలో సంచలనం రేపింది.

నగరంలోని శేషాద్రి రోడ్డులో ఉన్న మహారాణి ఆర్ట్స్ అండ్ కామర్స్ మేనేజ్ మెంట్ కళాశాల వసతిగృహంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి వేళ కొంతమంది యువకులు ప్రవేశించి అమ్మాయిలు ఆరుబయట ఆరబెట్టిన లో దుస్తులను ఎత్తుకెళ్లారు.

Miscreant enters college hostel, flees with women's innerwear

ఇటీవల రాత్రివేళ ఓ యువకుడు హాస్టల్ గోడ దూకి వచ్చి అమ్మాయిల లో దుస్తులను ఎత్తుకెళ్లిన ఘటన సీసీటీవీ ఫుటేజ్ లో బయటపడింది. ఓ ఆగంతకుడు గోడ దూకి హాస్టల్ లో కి ప్రవేశించడం గమనించిన అమ్మాయిలు వెంటనే ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు.

మరో రోజు ఓ యువకుడు హాస్టల్ లోకి రావడం చూసి సెక్యూరిటీ గార్డు వెంటాడగా అతడు గోడ దూకి పారిపోయాడు. రాత్రివేళ ఇలా అమ్మాయిల హాస్టల్ లో ఆగంతకుల ఆగడాలపై కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ శాంతకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BENGALURU: Officials of the hostel of Maharani's Arts, Commerce and Management College for Women, Seshadri Road, filed a police complaint on Monday, saying an unidentified person was frequently entering the hostel premises at night and wearing students' innerwear kept for drying. Hostel officials handed over to police CCTV footage of February 12, which shows him entering the premises nude at the dead of night and wearing the clothes of students. At one point of time, a security guard is seen chasing him but the man escapes.
Please Wait while comments are loading...