క్షణాల్లో!.. ముద్దులు పెట్టి పరార్.. హతాశయురాలైన యువతి..

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఐటీ నగరంలో వరుసగా మహిళలపై చోటు చేసుకుంటున్న అఘాయిత్యాలు అక్కడి మహిళలను, ముఖ్యంగా ఉద్యోగినులను కలవరపెడుతున్నాయి. తాజాగా ఓ బస్ స్టాప్ లో క్యాబ్ కోసం వేచియున్న యువతిపై ఒక అగంతకుడు ముద్దులతో విరుచుకుపడటం తీవ్ర కలకలం రేపింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనకు బాధిత యువతి హతాశయురాలైంది.

వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన యువతి(24) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఇటీవల తన స్నేహితుడితో కలిసి ఓ పార్టీకి హాజరైంది. అర్థరాత్రి వరకు సాగిన విందులో ఇద్దరూ మద్యం సేవించారు. తిరిగి 2.45గం. సమయంలో ఇద్దరు వెనుదిరిగారు. అయితే మద్యం సేవించి ఉండటం వల్ల.. బైక్ కన్నా క్యాబ్ లో వెళ్లడం సేఫ్ అని ఆమె బాయ్ ఫ్రెండ్ సూచించాడు.

దీంతో జేబీ నగర్ బస్ స్టాప్ వద్ద క్యాబ్ కోసం ఎదురుచూడసాగారు. ఇంతలో ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలియదు గానీ.. ఓ అగంతకుడు ఆమె వద్దకు రావడం.. ముద్దులు పెట్టి పారిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ సమయంలో యువతి బాయ్ ఫ్రెండ్ సెల్ ఫోన్ తో బిజీగా ఉండటంతో అగంతకుడిని అతను గమనించలేదు.

Miscreant kisses woman waiting for cab, scoots

దీనిపై యువతి బాయ్ ఫ్రెండ్ సోమవారం నాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా అతను పలు వివరాలు వెల్లడించాడు.

' స్నేహితుడు ఇచ్చిన ఓ లేట్ నైట్ పార్టీకి మేం వెళ్లాం. మద్యం సేవించి ఉండటం వల్ల బైక్ పై వెళ్లవద్దని, క్యాబ్ లో వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అనుకున్నట్లుగానే ఓ క్యాబ్ బుక్ చేసి జేబీ నగర్ బస్ స్టాప్ వద్ద పికప్ చేసుకోవాలని చెప్పాం. జేబీ నగర్ బస్టాప్ మా స్నేహితుడికి కూతవేటు దూరంలోనే ఉంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు గానీ.. ఓ బ్లాక్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి.. యువతి వద్దకు వచ్చి ఆమెకు ముద్దులు పెట్టి పరారయ్యాడు. ఆ సమయంలో నేను మొబైల్ ఫోన్ లీనమయ్యాను. చీకట్లో అతను ఎటువైపు వెళ్లాడో అర్థం కాలేదు' అని బాధిత యువతి బాయ్ ఫ్రెండ్ పేర్కొన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An unidentified miscreant allegedly molested a 24-year-old private company employee when she was waiting for a cab at a bus stop in the wee hours of Saturday.
Please Wait while comments are loading...