మోజు తీరింది: ఆన్ లైన్ ప్రేయసిని అతి దారుణంగా !
భోపాల్: ఆన్ లైన్ లో పరిచయం అయిన వ్యక్తిని నమ్మి వెళ్లిన యువతి అతి దారుణంగా హత్యకు గురైన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో జరిగింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆకాంక్ష శర్మ (28) అనే యువతిని భోపాల్ కు చెందిన ఉద్యాన్ దాస్ అనే వ్యక్తి హత్య చేశాడు.
ఆకాంక్ష శర్మ శవాన్ని నట్టింట్లో పాతి పెట్టి అక్కడ కాంక్రీట్ తో మూసివేసి చేతులు దులుపుకున్నాడు. గత ఏడాది ఆకాంక్ష శర్మ, ఉద్యాన్ దాస్ కు ఆన్ లైన్ లో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ఒకరినొకరు విడచి ఉండలేనంత స్థాయికి చేరింది.
ప్రియుడి దగ్గరకు వెళ్లాలని నిర్ణయించిన ఆకాంక్ష తాను అమెరికా వెలుతున్నానని ఇంట్లో చెప్పింది. కుటుంబ సభ్యులను నమ్మించి అమెరికా వెళ్లకుండా ఆమె భోపాల్ లోని సాకేత్ నగర్ లో ఉన్న ప్రియుడు ఉద్యాన్ దాస్ దగ్గరకు వెళ్లింది. ప్రతి రోజు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను అమెరికా నుంచి మాట్లాడుతున్నానని నమ్మించింది.

ఆకాంక్ష నిజంగా అమెరికా వెళ్లిందని కుటుంబ సభ్యులు నమ్మేశారు. తరువాత ప్రియుడితో కలిసి సహజీవనం చేసింది. 2016 డిసెంబర్ వరకు ఇలాగే ఫోన్ లో మాట్లాడిన ఆకాంక్ష కుటుంబ సభ్యులను ఫోన్ లో మాట్లాడుతూ అమెరికాలోనే ఉన్నానని నమ్మించింది.
డిసెంబర్ తరువాత ఫోన్ రాకపోవడం, కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే ఆకాంక్ష నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పశ్చిమ బెంగాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆకాంక్ష ఫోన్ నెంబర్ ను ట్రాక్ చేశారు. అయితే ఆకాంక్ష అమెరికా నుంచి ఫోన్ చెయ్యలేదని, భోపాల్ నుంచి ఫోన్ చేసిందని పోలీసులు గుర్తించారు.
భోపాల్ వెళ్లి దర్యాప్తు చేశారు. ఆకాంక్ష, ఉద్యాన్ దాస్ ల వివరాలు సేకరించారు. పోలీసులకు అనుమానం వచ్చి గురువారం అర్దరాత్రి ఉద్యాన్ దాస్ ను అదుపులోకి తీపుకుని విచారించారు. ఇంటి మధ్యలో ఉన్న కాంక్రీట్ కట్టడాన్ని పెద్దపెద్ద డ్రిల్లింగ్స్ పెట్టి పగలగొట్టి చూశారు.
అక్కడ మెటల్ బాక్స్ లో ఆకాంక్ష శవం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సహజీవనం చేసే సమయంలో తనకు ఆకాంక్షతో గొడవ వచ్చిందని, సహనం కోల్పోయి ఆమె గొంతు నులిమి హత్య చేసి మెటల్ బాక్స్ లో పెట్టి పూడ్చిపెట్టేశానని ఉద్యాన్ దాస్ అంగీకరించాడని పోలీసులు చెప్పారు.
ఈ విషయం తెలుసుకున్న ఆకాంక్ష కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు. మోజు తీరిన తరువాత ఆకాంక్షను హత్య చేశానని ఉద్యాన్ దాస్ చెప్పాడని పోలీసులు అన్నారు. ఉద్యాన్ దాస్ కు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ విలాసవంతమైన జీవితం గడిపే అలవాటు ఉందని పశ్చిమ బెంగాల్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications