వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Missing lady: ఇంటి పక్కనే పూడ్చేశాడు, 40 రోజుల ముందు ఏం జరిగింది. బుర్కా, నగలు, ఫోన్ ?

|
Google Oneindia TeluguNews

చెన్నై/ కొచ్చి/ మలప్పురం: ఇంటి నుంచి డెంటల్ క్లీనిక్ వెళ్లిన యువతి చివరికి శవమై కనిపించింది. హత్యకు గురైన యువతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సుబీరా హత్య కేసులో అరెస్టు అయిన నిందితుడు పోలీసులకు రోజుకో సినిమా స్టోరీ చెబుతున్నాడు. హత్యకు గురైన యువతి ఎముకలు మాత్రమే చిక్కడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. హత్యకు గురైన యువతి బూట్లు, హెయిర్ పిన్స్, బ్యాగ్ చివరి ఆమె బంగారు నగలు చిక్కాయి. ఇప్పుడు సబీరా మొబైల్ ఫోన్ పగిలిపోయి 500 అడుగుల లోతుపులోని పాడుపడిన బావిలో చిక్కడంతో కేసు మరో మలుపు తిరిగింది. సుబీరాపై అత్యాచారం చేసి హత్య చేశాడా ? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా ? అనే విషయం నిందితుడు అన్వర్ మాత్రం నోరు విప్పడం లేదని పోలీసులు అంటున్నారు.

Wife: భర్త, ప్రియుడు మందు పార్టీ, బెడ్ రూమ్ లో భార్య ? ఫుల్ బాటిల్ బ్రాందీతో ఫినిష్, కరోనా స్కెచ్ !Wife: భర్త, ప్రియుడు మందు పార్టీ, బెడ్ రూమ్ లో భార్య ? ఫుల్ బాటిల్ బ్రాందీతో ఫినిష్, కరోనా స్కెచ్ !

డెంటల్ క్లీనిక్ కు సుబీరా

డెంటల్ క్లీనిక్ కు సుబీరా

కేరళలోని మల్లప్పురం జిల్లాలోని వలచ్చేరి సమీపంలోని చూత్తూర్ లో నివాసం ఉంటున్న కబీర్ కుమార్తె సుబీరా ఫర్హాత్ అలియాస్ సుబీరా (21) అనే యువతి వలచ్చేరిలో డెంటల్ క్లీనిక్ నిర్వహిస్తున్నాది. ప్రతిరోజూ ఇంటి నుంచి వలచ్చేరికి వెలుతున్న సుబీరా తరువాత డెంటల్ క్లీనిక్ లో పని ముగించుకుని రాత్రి ఇంటి చేరుకుంటున్నది.

సుబీరా నాట్ రీచబుల్

సుబీరా నాట్ రీచబుల్


మార్చి 10వ తేదీన సుబీరా ఇంటి నుంచి వలచ్చేరిలోని డెంటల్ క్లీనిక్ కు వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో సుబీరా తండ్రి కబీర్ డెంటల్ క్లీనిక్ కు ఫోన్ చేసి తన కూతురు ఇంటికి రాలేదని చెప్పాడు. మీ అమ్మాయి ఈ రోజు డెంటల్ క్లీనిక్ కు రాలేదని, నిన్న వెళ్లిన సుబీరా గురించి మాకు తెలీదని చెప్పారు. హడలిపోయిన సుబీరా తండ్రి కబీర్ తన కుమార్తె కనపడటం లేదని వలచ్చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

40 రోజుల తరువాత శవం

40 రోజుల తరువాత శవం

సుబీరా ఆచూకి కోసం పోలీసులు ఎక్కడెక్కడో వెతికినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. చివరి సుబీరా నివాసం ఉంటున్న ఇంటికి 300 మీటర్ల దూరంలోని ఇటుకల బట్టీ సమీపంలోని పొలంలో యువతి శవం పూడ్చి పెట్టిన విషయం బయటపడింది. హత్యకు గురైయ్యింది సుబీరా అని ఆమె కుటుంబ సభ్యులు నిర్దారించారు. సుబీరా హత్యకు గురైన చోట ఆమె ఎముకలు మాత్రమే చిక్కడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

హెయిర్ పిన్స్, బూట్లు, బుర్కా

హెయిర్ పిన్స్, బూట్లు, బుర్కా

సుబీరా హత్యకు గురైన సమీపంలోని పొదల్లో ఆమె హెయిర్ పిన్స్, బ్యాండ్స్, ఆమె బూట్లు చిక్కాయి. కొద్ది దూరంలో సుబీరా ఇంటి నుంచి వేసుకుని వెళ్లిన బుర్కా కూడా పోలీసులకు చిక్కింది. సుబీరాను ఎవరు హత్య చేశారు అని మాత్రం అంతు చిక్కలేదు. అయితే సుబీరా మొబైల్ ఫోన్ హ్యాండ్ బ్యాగ్ పోలీసులకు చిక్కలేదు. నాలుగు రోజుల తరువాత సుబీరా హ్యాండ్ బ్యాగ్ పోలీసులకు చిక్కింది. సుబీరా హ్యాండ్ బ్యాగ్ లో ఓ కూజా చిక్కడంతో పోలీసులు దానిని క్షుణ్ణంగా పరిశీలించారు.

అన్వర్ అందర్

అన్వర్ అందర్

మంజేరి మెడికల్ కాలేజ్ కు సుబీరా అవయవాలను వైద్యపరీక్షలకు, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. సుబీరా హత్య కేసు విచారణలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అన్వర్ అనే నిందితుడు పోలీసులకు చిక్కాడు. పోలీసుల విచారణలో రోజుకు ఒక సినిమా స్టోరీ చెప్పిన అన్వర్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అన్వర్ సుబీరాను హత్య చేశాడు అనే పక్కా సమాచారం మాత్రం పోలీసులకు చిక్కలేదు.

రెండు షాపుల్లో సుబీరా నగలు

రెండు షాపుల్లో సుబీరా నగలు


పోలీసుల విచారణలో మూడు రోజుల తరువాత అన్వర్ మొదటిసారి నోరు విప్పాడు. సుబీరాను తాను హత్య చెయ్యాలని చెయ్యలేదని, నగల కోసం నోరు మూసిపెడితే ఆమె చనిపోయిందని అన్వర్ సినిమా స్టోరీ చెప్పాడు. చివరికి వలచ్చేరిలోని రెండు షాప్ ల్లో అన్వర్ కుదవపెట్టిన సుబీరా బంగారు నగలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

500 అడుగుల బావిలో సుబీరా మొబైల్ ఫోన్

500 అడుగుల బావిలో సుబీరా మొబైల్ ఫోన్


నగలు చిక్కిన తరువాత మరుసటి రోజు తాను సుబీరా మొబైల్ ఫోన్ 500 అడుగుల లోతులో ఉన్న పాడుపడిన బావిలో విసిరేశానని అన్వర్ పోలీసులకు చెప్పాడు. అతి కష్టం మీద పాడుపడిన బావిలో నుంచి సుబీరా మొబైల్ ఫోన్ ను బయటకు తీశారు. అయితే సుబీరా మొబైల్ ఫోన్ ను రాళ్లతో నజ్జునుజ్జు చెయ్యడంతో పోలీసులకు మళ్లీ సినిమా కష్టాలు ఎదరైనాయి.

పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు ?

పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు ?


వైద్యుల నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో సుబీరాపై బలంగా దాడి చెయ్యడం వలనే ఆమె మరణించిందని, ఆమె ఎముకలు దెబ్బతిన్నాయని వెలుగు చూసిందని సమాచారం. అయితే సుబీరా హత్య కేసులో అరెస్టు అయిన అన్వర్ మాత్రం సక్రమంగా నిజాలు బయటకు చెప్పకపోవడంతో పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. సుబీరాపై అత్యాచారం చేసి హత్య చేశాడా ?. ఈ హత్య కేసులో అన్వర్ తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా ? అనే కోణంలో కేరళ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

English summary
Missing lady: The police unearthed the body of a woman from Chottur, near Valanchery, in the district on Tuesday. The body is suspected to be that of a 21-year-old woman who had gone missing 40 days ago. A police team investigating the missing of Subeera Farhath, daughter of Kabeer, exhumed the body from a vacant piece of land some 300 metres from Farhath’s house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X